close

తాజా వార్తలు

Updated : 26/11/2020 13:41 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

అంతర్జాతీయ విమానాలపై ఆంక్షల పొడిగింపు

ఐతే నిబంధనల మేరకు ఈ దేశాలకు వెళ్లవచ్చు

దిల్లీ: అంతర్జాతీయ విమాన ప్రయాణాలపై నిషేధాన్ని కేంద్ర ప్రభుత్వం మరోసారి పొడిగించింది. కరోనా వైరస్‌ వ్యాప్తితీవ్రత కారణంగా ఈ నిషేధం డిసెంబర్‌ 31 వరకు అమలులో ఉంటుందని డైరక్టరేట్‌ జనరల్‌ ఆఫ్ సివిల్‌ ఏవియేషన్‌ (డీజీసీఏ) ప్రకటించింది. అయితే, కార్గో విమానాలకు ఈ నిషేధం వర్తించదని సంస్థ తెలిపింది. కాగా, ఎంపిక చేసిన కొన్ని మార్గాల్లో మాత్రమే.. ప్రతి ఒక్క సందర్భం, పరిస్థితిని పరీశీలించిన తర్వాతే విమాన సర్వీసులను అనుమతిస్తామని డీజీసీఏ వివరించింది. అంతర్జాతీయ విమానయానం, వీసా నిబంధనలకు సంబంధించి నవంబర్‌ 30 వరకు ఉన్న నిషేధాన్ని డిసెంబర్‌ 31 వరకు పొడిగించామని డీజీసీఏ తెలిపింది.

ఈ దేశాలకు ప్రయాణించొచ్చు..
కొవిడ్‌-19 వ్యాప్తి కట్టడి చర్యల్లో భాగంగా భారత్‌ మార్చి 23న అంతర్జాతీయ విమాన సర్వీసులను రద్దు చేసింది. అయితే, వందేభారత్‌ మిషన్‌ కార్యక్రమంలో భాగంగా వివిధ దేశాలకు మే నుంచి ప్రత్యేక విమానాలు నడుస్తున్న సంగతి తెలిసిందే. భారత్‌తో ఎయిర్‌ బబుల్‌ ఒప్పందం చేసుకున్న 22 దేశాలకు మాత్రమే ఈ అంతర్జాతీయ విమాన సర్వీసులు అందుబాటులో ఉంటాయి. ప్రస్తుతం భారత్‌, అమెరికాతో సహా అప్ఘనిస్తాన్‌, బంగ్లాదేశ్, బహ్రైన్, భూటాన్‌, కెనడా, ఇథియోపియా, ఫ్రాన్స్‌, జర్మనీ, ఇరాక్‌, జపాన్‌, కెన్యా, మాల్దీవులు, నెదర్లాండ్స్, నైజీరియా, ఒమాన్‌, కతార్‌, ర్వాండా, టాంజానియా, యూఏఈ, బ్రిటన్‌, ఉక్రైన్‌ తదితర దేశాలతో బయోబబుల్‌ ఒప్పందంలో ఉంది.


Tags :
జిల్లా వార్తలు
బిజినెస్‌
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
క్రైమ్
మరిన్ని