close

తాజా వార్తలు

ఆంగ్లభాష బాగా మాట్లాడే దేశాల్లో భారత్‌ది 34వ స్థానం

లుసెర్న్‌ (స్విట్జర్లాండ్‌): మాతృభాష ఇంగ్లిషు కానప్పటికీ ప్రపంచవ్యాప్తంగా ఆంగ్లభాషను విస్తృతంగా మాట్లాడే దేశాల్లో నెదర్లాండ్స్‌ అగ్రస్థానంలో నిలవగా భారత్‌ 34వ స్థానంలో నిలిచింది. ఆంగ్లేతర మాతృభాషను కలిగిన దేశాల్లో ఇంగ్లిషు బాగా మాట్లాడే ప్రజల సంఖ్య ప్రాతిపదికన రూపొందించిన ‘‘ఆంగ్లభాషా ప్రావీణ్య సూచీ-2019’ ప్రకారం స్వీడన్‌ రెండోస్థానంలో ఉంది. నార్వే మూడో స్థానంలో నిలిచింది. ‘ఈఎఫ్‌ ఎడ్యుకేషన్‌ ఫస్ట్‌’’ అనే సంస్థ అధ్యయనం అనంతరం ఈ వివరాలను ప్రకటించింది. ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లో నిర్వహించిన ఉచిత ఆన్‌లైన్‌ పరీక్షల ఆధారంగా అక్కడి ప్రజల ఆంగ్లభాషా ప్రావీణ్యాన్ని మదింపు చేశారు. 


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.