కొత్త కేసులు 55వేలు.. కోలుకున్నవారు 77వేలు
close

తాజా వార్తలు

Published : 13/10/2020 09:58 IST

కొత్త కేసులు 55వేలు.. కోలుకున్నవారు 77వేలు

దిల్లీ: దేశంలో క్రియాశీల కరోనా కేసులు క్రమంగా తగ్గుతుండటం ఊరటనిస్తోంది. గత కొన్ని రోజులుగా తగ్గుతూ వస్తున్న యాక్టివ్‌ కేసులు మంగళవారం నాటికి 8,38,729కి పడిపోయాయి. దీంతో ఇప్పటివరకు నమోదైన మొత్తం కేసుల్లో క్రియాశీల కేసులు 11.69శాతానికి తగ్గాయి. క్రియాశీల కేసులు తగ్గిపోవడాన్ని బట్టి చూస్తుంటే మూడు నెలల్లో మొత్తం యాక్టివ్‌ కేసులు కనుమరుగయ్యే అవకాశం ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. గడిచిన 24 గంటల్లో మరో 77,760 మంది కొవిడ్‌ నుంచి కోలుకున్నారు. దీంతో రికవరీ రేటు 86.78శాతానికి పెరిగింది. 

ఇక గడచిన 24 గంటల్లో 55,342 కొత్త కేసులు నమోదు కాగా.. దేశంలో మొత్తం కేసుల సంఖ్య  71,75,881కి చేరింది. వీరిలో ఇప్పటివరకు 62,27,296 మంది వైరస్‌ నుంచి కోలుకుని ఇళ్లకు వెళ్లారు. ఇక గత 24 గంటల్లో మరో 706 మంది కరోనాకు బలయ్యారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 1,09,856కి పెరిగినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ మంగళవారం వెల్లడించింది. దేశంలో కరోనా మరణాల రేటు 1.53శాతంగా ఉంది. 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని