close
Array ( ) 1

తాజా వార్తలు

Published : 05/05/2020 12:30 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

‘నేరుగా ప్రజల చేతుల్లోకే డబ్బు చేర్చాలి’

ఆర్థిక వ్యవస్థ పునరుద్ధరణకు అభిజిత్‌ బెనర్జీ సూచనలు

దిల్లీ: కొవిడ్‌-19 కట్టడి కోసం దేశంలో విధించిన లాక్‌డౌన్‌ వల్ల కుదేలైన ఆర్థిక వ్యవస్థ పునరుద్ధరణకు ప్రముఖ ఆర్థికవేత్త, నోబెల్‌ బహుమతి గ్రహీత అభిజిత్‌ బెనర్జీ పలు కీలక సూచనలు చేశారు. భారత్‌లో ఇంకా భారీ ఉద్దీపన పథకాన్ని ప్రవేశపెట్టాల్సిన అవసరం ఉందన్నారు. డిమాండ్‌ పుంజుకోవాలంటే ప్రజల చేతుల్లోకి డబ్బు చేర్చాలని సూచించారు. ఆర్థిక వ్యవస్థను పునరుద్ధరించడానికి అనుసరించాల్సిన అంశాలపై కాంగ్రెస్‌ పార్టీ మాజీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ ప్రశ్నలకు మంగళవారం వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా అమెరికా నుంచి ఆయన పలు ప్రశ్నలకు సమాధానమిచ్చారు. ఈ కార్యక్రమాన్ని సామాజిక మాధ్యమ ఖాతాల ద్వారా కాంగ్రెస్‌ ప్రసారం చేసింది.

ఇంకా భారీ ఉద్దీపన పథకం అవసరం..

దేశంలో ఉద్యోగకల్పనకు కీలకంగా మారిన సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు భారీ ఉద్దీపన ప్యాకేజీ ప్రకటించాల్సిన అవసరం ఉందని అభిజిత్‌ బెనర్జీ అన్నారు. అమెరికా, జపాన్‌ సహా ఐరోపా దేశాలు ఈ విషయంలో బాగా పనిచేస్తున్నాయని తెలిపారు. భారత్‌ ఇంకా భారీ ఉద్దీపనకు సిద్ధం కాలేదని.. జీడీపీలో ఒక శాతంపైనే ఇంకా చర్చ జరుగుతోందన్నారు. అదే అమెరికాలో జీడీపీలో 10శాతం ఖర్చు చేసేందుకు సిద్ధమయ్యారని గుర్తుచేశారు. 

కింది స్థాయి 60 శాతం ప్రజలే లక్ష్యం..

నేరుగా ప్రజల చేతుల్లోకే డబ్బు చేర్చే మార్గాలపై దృష్టి సారించాలని సూచించారు. అయితే, లబ్ధిదారుల ఎంపికలో కేవలం పేదలు మాత్రమే ఉండేలా చూడాలని.. ఈ ప్రక్రియను చాలా పకడ్బందీగా చేపట్టాల్సిన అవసరం ఉందన్నారు. ఆర్థికంగా కింది స్థాయిలో ఉన్న 60శాతం ప్రజలకు నేరుగా డబ్బులు ఇవ్వడం వల్ల ఎలాంటి దుష్పపరిణామాలు ఉండవని తాను భావిస్తున్నట్లు పేర్కొన్నారు.

తాత్కాలిక రేషన్‌ కార్డులివ్వండి..

లాక్‌డౌన్‌ ఎత్తివేస్తేనే ఆర్థిక వ్యవస్థ పుంజుకుంటుందని అభిజిత్‌ అభిప్రాయపడ్డారు. అయితే, కరోనా వైరస్‌ కేసుల సంఖ్య పెరుగుతున్న క్రమంలో మాత్రం అలాంటి నిర్ణయం తీసుకోవడం కూడా సరైన చర్య కాదన్నారు. ఇక ఆహార సమస్య గురించి ప్రస్తావిస్తూ.. రేషన్‌ కార్డులు లేనివారికి తాత్కాలిక కార్డులు ఇచ్చే ప్రయత్నం చేయాలని సూచించారు. ఆధార్‌ కార్డుతో ప్రజా పంపిణీ వ్యవస్థను అనుసంధానం చేసి ఉంటే నేడు ఈ పరిస్థితి తలెత్తి ఉండేది కాదని అభిప్రాయపడ్డారు. దేశంలో ఆహారధాన్యాల నిల్వల విషయంలో ఎలాంటి కొరత లేదని స్పష్టం చేశారు. 

వలస కార్మికులపై మరింత చొరవ తీసుకోవాల్సింది..

వలస కార్మికుల విషయంలో కేంద్రం మరింత చొరవ తీసుకొని ఉండాల్సిందని అభిజిత్‌ అభిప్రాయపడ్డారు. వారి తరలింపు విషయంలో సమన్వయ లోపం స్పష్టంగా కనిపిస్తోందని.. కేవలం రాష్ట్రాలకే ఆ బాధ్యతను అప్పగించకుండా కేంద్రం కూడా పాలుపంచుకోవాల్సిందని అభిప్రాయపడ్డారు. తరలింపునకు ముందు కార్మికులకు చేయాల్సిన పరీక్షల బాధ్యత కేంద్ర ప్రభుత్వమే తీసుకొని ఉండాల్సిందన్నారు.

రాష్ట్రాలకు నిధులివ్వాలి..

రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్ర నిధులు సమకూర్చాలని అభిజిత్‌ సూచించారు. తద్వారా ఎక్కువ మంది ప్రజలకు చేరువయ్యేలా ఆ రాష్ట్రాలే పథకాల్ని రూపొందించుకునే వెసులుబాటు కలుగుతుందన్నారు. దీని వల్ల నిధులు కూడా దుర్వినియోగం కావని స్పష్టం చేశారు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో రిస్క్‌ తీసుకుంటూ ధైర్యంగా ముందుకు వెళ్లడం ఒక్కటే మార్గమని హితవు పలికారు.

ఇవీ చదవండి..

సుదీర్ఘ లాక్‌డౌన్‌ మంచిది కాదు: రఘురాం రాజన్‌

భారత్‌లో ఒకేరోజు 195మరణాలు, 3,900కేసులు


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.