
తాజా వార్తలు
బ్రహ్మోస్.. తాజా పరీక్ష విజయవంతం
దిల్లీ: సూపర్సోనిక్ క్రూయిజ్ క్షిపణి బ్రహ్మోస్‌ను భారత్ మరోసారి విజయవంతంగా ప్రయోగించింది. వరుస ప్రయోగాల్లో భాగంగా మంగళవారం భూ ఉపరితలం నుంచి మరో చోటుకు పరీక్షించింది. బ్రహ్మోస్ వాస్తవ దాడి పరిధి 290 కి.మీ ఉండగా దానిని ఇప్పుడు 400 కిలోమీటర్లకు పెంచారు. ఇక శబ్ద వేగానికి మూడు రెట్లు లేదా 2.9 మాక్‌ల వేగాన్ని మెయింటెన్ చేశారు.
‘భూమిపై దాడులకు సంబంధించిన బ్రహ్మోస్ వెర్షన్‌ను అండమాన్, నికోబార్‌లో ఉదయం 10 గంటలకు విజయవంతంగా ప్రయోగించాం’ అని సంబంధిత అధికారి మీడియాకు తెలిపారు. మరికొద్ది రోజుల్లో గగన తలం, నీటి ఉపరితల వెర్షన్లను భారత వాయుసేన, భారత నౌకాదళం పరీక్షిస్తాయని వెల్లడించారు. భారత్, రష్యా సంయుక్తంగా అభివృద్ధి చేసిన బ్రహ్మోస్ క్షిపణులు అత్యంత సమర్థంగా లక్ష్యాన్ని ఛేదిస్తాయన్న సంగతి తెలిసిందే.
జలాంతర్గాములు, నౌకలు, విమానాలు, నేలమీద నుంచి బ్రహ్మోస్ క్షిపణులను ప్రయోగించవచ్చు. చైనా సరిహద్దుల్లోని లద్దాఖ్, అరుణాచల్ ప్రదేశ్‌లో ఇప్పటికే భారత్ వీటిని భారీ సంఖ్యలో మోహరించింది. గత రెండు నెలల్లో భారత్ చాలా క్షిపణులను పరీక్షించిన సంగతి తెలిసిందే. యాంటీ రేడియేషన్ క్షిపణి ‘రుద్రం-1’ సైతం ఇందులో ఉంది. గల్వాన్ లోయలో భారత్, చైనా సైనికులు బాహాబాహీకి దిగినప్పటి నుంచి ప్రయోగాలు ఊపందుకున్నాయి.
జనరల్
రాజకీయం
సినిమా
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
చిత్ర వార్తలు
సినిమా
- కల లాంటిది.. నిజమైనది
- భారత్-ఎ జట్టుతో వాళ్లు గెలిచారు: పాంటింగ్
- ఆసీస్ మాజీలూ.. ఇప్పుడేమంటారు?
- మెగాస్టార్ పాత ఫొటో.. గందరగోళంలో రమ్యకృష్ణ!
- భలే పంత్ రోజు..
- గబ్బా హీరోస్.. సూపర్ మీమ్స్
- ఆ విశ్వాసంతోనే వెళ్లిపోతున్నా: ట్రంప్
- ప్రేమోన్మాది ఘాతుకానికి.. యువతి బలి
- రోజూ అనుకునేవాణ్ని.. ఇవాళ గెలిపించాను!
- కష్టాలను దాటి.. మేటిగా ఎదిగి
ఎక్కువ మంది చదివినవి (Most Read)
