close
Array ( ) 1

తాజా వార్తలు

Published : 28/02/2020 23:59 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

ఆ దేశాల వీసా ఆన్‌ అరైవల్‌ కు తాత్కాలిక బ్రేక్‌

దిల్లీ: ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్‌ కేసుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో... జపాన్‌, దక్షిణ కొరియా దేశాల పౌరులకు ‘వీసా ఆన్‌ అరైవల్‌’ సౌకర్యాన్ని తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్టు భారత రాయబార కార్యాలయం ప్రకటించింది. అయితే, ఈ రెండు దేశాల ప్రజలకు సాధారణ వీసాల జారీ యధావిధిగానే ఉంటుందని అందుకు దరఖాస్తు చేసుకోవచ్చని అధికారులు వివరించారు. చైనా తర్వాత కరోనా వైరస్‌ వ్యాప్తి అత్యధికంగా ఉన్న దేశం దక్షిణ కొరియా. ఈ దేశంలో 2000 పైగా కొవిడ్‌-19 కేసులు నమోదు కాగా... ఈ వ్యాధి కారణంగా 13 మంది మృత్యువాతపడ్డారు. జపాన్‌ తీరంలో ఉన్న కరొనా వైరస్‌ ప్రభావిత నౌక ‘డైమండ్‌ ప్రిన్సెస్‌’ నుంచి 119 భారతీయులు, ఐదుగురు విదేశీ పౌరులు భారత్‌కు వచ్చిన ఒక రోజు అనంతరం ఈ ప్రకటన వెలువడటం గమనార్హం. 

చైనా పౌరులు, రెండు వారాల వ్యవధిలో ఆ దేశానికి వెళ్లి వచ్చిన యాత్రికులకు భారత్‌ ఫిబ్రవరి 2న ఈ-వీసా సదుపాయాన్ని రద్దు చేసిన సంగతి తెలిసిందే. కాగా శుక్రవారం నాటికి చైనాలో కరోనా మృతుల సంఖ్య 2,788 కి చేరుకోగా... మరో 78,824 మందికి ఆ వ్యాధి సోకినట్టు చైనా ఆరోగ్య శాఖ అధికారులు ప్రకటించారు. 


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.