జవాన్ల కోసం వాట్సాప్‌ తరహా యాప్‌
close

తాజా వార్తలు

Published : 30/10/2020 17:27 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

జవాన్ల కోసం వాట్సాప్‌ తరహా యాప్‌

దిల్లీ: దేశ భద్రతకు సంబంధించిన సున్నితమైన సమాచారం ఇతరులకు చేరకూడదన్న లక్ష్యంతో జవాన్ల కోసం భారత ఆర్మీ వాట్సాప్‌ తరహా కొత్త యాప్‌ను రూపొందించింది. దీనికి సాయ్‌ (సెక్యూరిటీ అప్లికేషన్‌ ఫర్‌ ద ఇంటర్నెట్‌) అని పేరుపెట్టింది. ఇందులో వాయిస్‌, వీడియో, ఆడియో మేసేజులకు ఎండ్‌-టు- ఎండ్‌ ఎన్‌క్రిప్షన్‌ ఉంటుందని భారత రక్షణ శాఖ ఓ ప్రకటనలో తెలిపింది. 

వాట్సాప్‌, టెలీగ్రామ్‌, సంవాద్‌ వంటి కమర్షియల్‌ యాప్స్‌ తరహాలోనే ఈ యాప్‌ పనిచేస్తుందని, ఎండ్‌-టు- ఎండ్‌ ఎన్‌క్రిప్షన్‌ మెసేజింగ్‌ ప్రోటోకాల్‌ కలిగి ఉందని రక్షణ శాఖ తెలిపింది. అంతర్గత సర్వర్లపై ఇది పనిచేస్తుందని, సొంత అవసరాలకు అనుగుణంగా ఈ యాప్‌ రూపొందిందని తెలిపింది. దశలవారీగా ఆండ్రాయిడ్‌ వినియోగదారులకు ఈ యాప్‌ను అందిస్తామని రక్షణ శాఖ తెలిపింది. ఐవోఎస్‌ సంబంధించిన యాప్‌ సిద్ధమవుతోందని పేర్కొంది. ఈ యాప్‌ను రాజస్థాన్‌లోని సిగ్నల్స్‌ యూనిట్‌కు చెందిన కమాండింగ్‌ ఆఫీసర్‌ కల్నల్‌ సాయి శంకర్‌ అభివృద్ధి చేశారు. ఈ యాప్‌ను పరిశీలించిన రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ ఆయన కృషిని కొనియాడారు.

అధికారిక కార్యకలాపాల్లో సామాజిక మాధ్యమాల వినియోగం వల్ల దేశ భద్రతకు సంబంధించిన కీలక సమాచారం ఇతరులకు చిక్కే అవకాశం ఉన్న నేపథ్యంలో ఇప్పటికే రక్షణ శాఖ పలు నిర్ణయాలు తీసుకుంది. కేంద్రం ఇటీవల నిషేధించిన 59 యాప్స్‌ను తమ ఫోన్లలో తొలగించాలని జవాన్లకు రక్షణ శాఖ సూచించింది. వీటితో పాటు ఫేస్‌బుక్‌, టిండర్‌, జూమ్‌ వంటి యాప్స్‌ను కూడా తొలగించాలంది. అధికార సమాచార మార్పిడికి వాట్సాప్‌ వినియోగించొద్దని సూచించింది. ఈ క్రమంలో ఈ యాప్‌ను తీసుకురావడం గమనార్హం.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని