మత్య్సకారులపై  శ్రీలంక నేవీ దాడి
close

తాజా వార్తలు

Updated : 27/10/2020 10:44 IST

మత్య్సకారులపై  శ్రీలంక నేవీ దాడి

చెన్నై: అంతర్జాతీయ సరిహద్దు నిబంధనలను ఉల్లంఘించి తమ జలాల్లోకి అక్రమంగా ప్రవేశించారంటూ శ్రీలంక నేవీ సిబ్బంది భారత మత్స్యకారులపై దాడి చేశారు. ఈ ఘటనలో ఓ మత్స్యకారుడు తీవ్రంగా గాయపడ్డారు.  అయితే శ్రీలంక నేవీ కావాలనే తమపై దాడి చేసిందని, తాము విదేశీ జలాల్లోకి ప్రవేశించలేదని మత్స్యకారులు చెబుతున్నారు. తమపై రాళ్లు విసిరారని, వలలను చింపేశారని ఆవేదన వ్యక్తం చేశారు. గాయపడిన మత్స్యకారుడిని తమిళనాడులోని రామేశ్వరానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు.

తమిళనాడుకు చెందిన మత్స్యకారులపై శ్రీలంక నేవీ సిబ్బంది దాడి చేయడం రివాజుగా మారిపోయింది. ఇప్పటికే పలుమార్లు ఇలాంటి సంఘటనలు చోటు చేసుకున్నాయి. కొన్నిసార్లు మత్స్యకారులను అక్కడికి తీసుకెళ్లి జైలులో బంధించిన  సందర్భాలూ ఉన్నాయి. ఇలాంటి ఘటనలను తమిళనాడు ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తోంది. భారత మత్స్యకారులపై శ్రీలంక నేవీ సిబ్బంది దాడులకు పాల్పడకుండా చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వానికి ఇది వరకే లేఖ రాసింది. హిందూమహాసముద్రంలో ఇలాంటి ఘటనలకు చరమగీతం పాడేలా శ్రీలంక ప్రభుత్వంతో చర్చించాలని ఇదివరకే కోరింది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని