ఇప్పుడు కరోనాయే కథా వస్తువు 
close

తాజా వార్తలు

Published : 23/08/2020 07:24 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఇప్పుడు కరోనాయే కథా వస్తువు 

ఇంటర్నెట్‌డెస్క్‌: ఒకప్పుడు చిత్ర పరిశ్రమలో ఫక్తు కమర్షియల్‌ సినిమాలు మాత్రమే వచ్చేవి. కథానాయకులు సైతం ఇమేజ్‌, తమ అభిమానులను దృష్టిలో పెట్టుకుని ప్రయోగాల జోలికి వెళ్లేవారు కాదు. వాస్తవ సంఘటనల ఆధారంగా సినిమాలు తీయాలంటే భయం. ఒకరిద్దరు దర్శకులు ధైర్యం చేసి తీసినా, అలాంటివి ప్రేక్షకులు హర్షించరేమో అనుకునేవారు. కానీ, గత కొంతకాలంగా చిత్ర పరిశ్రమలో అనేక మార్పులు చోటు చేసుకున్నాయి. కొత్త దర్శకులు రావడం, యథార్థ సంఘటనలు, వాస్తవ పరిస్థితులు కథాంశాలు కావడం చిన్న చిత్రాలుగా విడుదలై బాక్సాఫీస్‌ వద్ద భారీ విజయాన్ని అందుకుంటున్నాయి. ప్రస్తుతం ప్రపంచాన్ని వణికిస్తోంది కరోనా వైరస్‌. ఇప్పుడు పలువురు రచయితలకు, దర్శకులకు ఇదే కథా వస్తువు అయింది.

వివాదాలకే కేరాఫ్ అడ్రస్‌ అయిన రామ్‌గోపాల్‌వర్మ ‘కరోనా వైరస్‌’ పేరుతో సినిమా తీసి ట్రైలర్‌ కూడా విడుదల చేశారు. ఇప్పుడు ఆయన బాటలో పలువురు దర్శకులు పయనిస్తున్నారు. అనుభవ్‌ సిన్హా, సుధీర్‌ మిశ్రా, హన్సల్‌ మెహతా, కేతన్‌ మెహతా, సుభాష్‌ కపూర్‌లు కలిసి కరోనా వైరస్‌పై వెబ్‌ సిరీస్‌ తీసేందుకు సిద్ధమయ్యారు. మరోవైపు ‘తుంబాద్‌’ వంటి వైవిధ్య కథను తెరకెక్కించిన ఆనంద్‌ గాంధీ సైతం కరోనా వైరస్‌పై సినిమా తీసేందుకు స్క్రిప్ట్‌ సిద్ధం చేసుకుంటున్నారు. ‘మహమ్మారి తర్వాత ప్రపంచం ఎలా ఉండబోతోందో చూపిస్తాం’ అని ఆయన చెబుతున్నారు.

ఇటీవల ‘కరోనా వైరస్‌’ సినిమా ట్రైలర్‌ విడుదల సందర్భంగా తన సినిమా హారర్‌ చిత్రం కాదని వర్మ పేర్కొన్నారు. వైరస్‌ వల్ల ఒక కుటుంబంలో ఎలాంటి భయాందోళనలు నెలకొన్నాయన్న అంశాన్ని మాత్రమే చూపిస్తున్నామని అన్నారు. దీనిపై సినీ విమర్శకుడు మనోజ్‌ కుమార్‌ మాట్లాడుతూ.. ‘కరోనా వ్యాప్తి చెందడానికి అనేక వైఫల్యాలు ఉన్నాయి. దీన్ని అనేక కోణాల్లో మనం చూడవచ్చు. ఈ నేపథ్యంలో చాలా సినిమాలు వస్తాయి. అయితే, సిన్హా, గాంధీలు తీసే చిత్రాలు భారీగా ఉండకపోవచ్చు’ అని అన్నారు. ‘కరోనా వైరస్‌పై సినిమా తీయాలంటే భావోద్వేగ, మానవాసక్తి సన్నివేశాలకు పెద్ద పీట వేయాలి. ముఖ్యంగా మధ్యతరగతి ఎదుర్కొన్న ఇబ్బందులు ప్రభావవంతంగా చూపించగలగాలి. వలసదారులు, వైద్య వ్యవస్థ వైఫల్యం ఇలా అనేక కోణాలను చూపించనప్పుడే ఆ సినిమాలు ఆకట్టుకుంటాయి’ అని చెప్పుకొచ్చారు.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని