close

తాజా వార్తలు

Published : 02/08/2020 10:28 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

‘విరుష్క’ జంటకు 150  రోజుల ఎడబాటు!

కరోనాతో టీమ్‌ఇండియా క్రికెటర్లకు విచిత్ర పరిస్థితి

ఇంటర్‌నెట్‌ డెస్క్‌: టీమ్‌ఇండియా క్రికెటర్లకు విచిత్రమైన అనుభవం ఎదురవ్వనుంది! ఏడాది పొడవునా క్రికెట్‌ ఆడటం వల్ల సాధారణ పరిస్థితుల్లో కుటుంబ సభ్యులతో గడిపేందుకు సమయం దొరికేది కాదు. అయితే కొవిడ్‌-19 మహమ్మారితో దాదాపు నాలుగు నెలలుగా ఇంట్లోనే ఉంటున్నారు. కుటుంబీకులతో కాలాన్ని ఆస్వాదిస్తున్నారు. మళ్లీ ఐపీఎల్‌ ఆరంభమైతే దాదాపు 150 రోజులు కుటుంబ సభ్యులను కలవడం కుదరదని తెలుస్తోంది. కోహ్లీ-అనుష్క, రోహిత్‌-రితిక, ధోనీ-సాక్షి సహా అనేక జంటలకు ఎడబాటు తప్పదు!

ఇన్నాళ్లూ ఐపీఎల్‌-2020 జరుగుతుందో లేదోనని సందేహాలు ఉండేవి. టీ20 ప్రపంచకప్‌ వాయిదాతో చకచకా మార్పులు సంభవించాయి. యూఏఈ వేదికగా సెప్టెంబర్‌ 19 నుంచి నవంబర్‌ 8 (లేదా 10) వరకు లీగ్‌ను నిర్వహిస్తామని ఐపీఎల్‌ ఛైర్మన్‌ బ్రిజేష్‌ పటేల్‌ ప్రకటించారు. దాంతో అందరూ సంతోషపడ్డారు. అయితే అత్యుత్తమంగా ఆడాలంటే ఆటగాళ్లు మళ్లీ ఫిట్‌నెస్‌ పెంచుకోవాలి. కనీసం ఆరు వారాలు కఠినంగా సాధన చేయాలి. అంటే ముందుగానే ఫ్రాంచైజీలు ఏర్పాటు చేసే శిబిరాలకు క్రికెటర్లు వెళ్లాల్సి ఉంటుంది. దాదాపు ఆగస్టు మధ్యలో వీరంతా దుబాయ్‌ చేరుకుంటారని తెలుస్తోంది.

దుబాయ్‌ చేరుకున్న తర్వాత క్రికెటర్లంతా బయోసెక్యూర్‌ వాతావరణంలో ఉంటారు. ఇప్పటి వరకైతే కుటుంబీకులను అక్కడికి అనుమతించడంపై స్పష్టత లేదు. బహుశా 10-15 రోజులు అనుమతి ఇవ్వొచ్చని అనుకుంటున్నారు. సురక్షితం కాదని భావిస్తే మొత్తంగా అనుమతించకపోవచ్చు. ఐపీఎల్‌ ముగిసే వరకు అంటే నవంబర్‌ 10 వరకు క్రికెటర్లు అక్కడే ఉండి అట్నుంచి ఆస్ట్రేలియాకు వెళ్లాల్సి ఉంటుంది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం అక్కడ కనీసం వారం నుంచి రెండు వారాలు క్వారంటైన్‌ ఉండాల్సి రావొచ్చని తెలుస్తోంది. అయితే సాధన చేసుకొనేందుకు ఏర్పాట్లు చేస్తామని క్రికెట్‌ ఆస్ట్రేలియా తెలిపింది.

డిసెంబర్‌ 3న ఆస్ట్రేలియాలతో తొలి టెస్టు ఆరంభమవుతుంది. ఈ సిరీస్‌ ముగిశాక జనవరి 12 నుంచి 17 వరకు వన్డే సిరీస్‌ ఆడాల్సి ఉంటుంది. ఆస్ట్రేలియా పర్యటన దాదాపుగా 68 రోజులు ఉండనుంది. అంటే ఆగస్టు మధ్య నుంచి జనవరి వరకు దాదాపు 150 రోజులు టీమ్‌ఇండియా క్రికెటర్లు కుటుంబ సభ్యులు సహా ఇతరులను కలిసేందుకు వీల్లేదన్నమాట. కరోనా వైరస్‌ పరిస్థితుల్లో బయోసెక్యూర్‌ వాతావరణ నిబంధనలను కఠినంగా అమలు చేయాల్సి ఉంటుంది. ఆటగాళ్ల భద్రత విషయంలో రాజీ పడబోమని ఇప్పటికే దాదా స్పష్టం చేసిన సంగతి తెలిసిందే.


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.