close

తాజా వార్తలు

Published : 07/07/2020 09:59 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

భార‌త్‌లో 7ల‌క్ష‌ల కేసులు, 20వేల మ‌ర‌ణాలు!

24గంటల్లో 22,252 కేసులు, 467మంది మృతి

దిల్లీ: క‌రోనా మ‌హ‌మ్మారి విజృంభ‌ణ‌తో భార‌త్ అత‌లాకుతలం అవుతోంది. గ‌త‌వారం రోజులుగా నిత్యం 20వేల‌కు పైగా పాజిటివ్ కేసులు బ‌య‌ట‌ప‌డుతూనే ఉన్నాయి. తాజాగా దేశంలో నిన్న 22,252 కేసులు బ‌య‌ట‌ప‌డ‌డంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 7,19,665కి చేరిన‌ట్లు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌శాఖ వెల్ల‌డించింది. ఇక‌ దేశంలో కొవిడ్ మ‌ర‌ణాల సంఖ్య క‌ల‌వర‌పెడుతోంది. తాజాగా నిన్న ఒక్క‌రోజే 467మంది మృత్య‌వాత‌ప‌డ్డారు. దీంతో భార‌త్‌లో కొవిడ్ మృతుల సంఖ్య 20,160కు చేరింది. క‌రోనా సోకిన మొత్తం బాధితుల్లో ఇప్ప‌టివ‌ర‌కు 4,39,948 మంది కోలుకోగా మ‌రో 2,59,557 యాక్టివ్ కేసులు ఉన్న‌ట్లు ప్ర‌భుత్వం పేర్కొంది. ప్ర‌స్తుతం క‌రోనా వైర‌స్ విజృంభ‌ణ‌తో భార‌త్ ప్ర‌పంచంలోనే మూడోస్థానంలో కొన‌సాగుతోంది.

ఆరు రోజుల్లోనే ల‌క్షా 34వేల కేసులు,2760 మ‌ర‌ణాలు..

ఇక‌ దేశంలో జులై మాసం ప్రారంభం నుంచి కేసుల సంఖ్య మ‌రింత పెరుగుతోంది. జులై 1 నాటికి దేశంలో 5,85,493 క‌రోనా కేసులు న‌మోదుకాగా ఈ ఆరు రోజుల్లోనే ల‌క్షా 34వేల కేసులు న‌మోద‌య్యాయి. అంతేకాకుండా  ఈ ఆరురోజుల్లోనే దేశంలో 2760 మంది క‌రోనా రోగులు మృత్యువాత‌ప‌డ్డారు.

ఇవీ చ‌ద‌వండి..
భార‌త్‌..ప్ర‌పంచంలోనే మూడో స్థానంలోకి..
కోటి దాటిన కొవిడ్ ప‌రీక్ష‌లు


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని