close
Array ( ) 1

తాజా వార్తలు

అనుభవం లేకున్నా షా, మయాంక్‌ అదుర్స్‌

వెల్లింగ్టన్‌: టీమ్‌ఇండియా ఓపెనింగ్‌ జోడీకి ఎక్కువ అనుభవం లేనప్పటికీ మైదానంలో అద్భుతంగా ఆడగలదని కివీస్‌ సీనియర్‌ పేసర్‌ టిమ్‌ సౌథీ అన్నాడు. మ్యాచ్‌ గమనాన్ని వారు మార్చేయగలరని వెల్లడించాడు. గాయం కారణంగా రోహిత్‌ శర్మ దూరమయ్యాడు. కేఎల్‌ రాహుల్‌ ఎంపికవ్వలేదు. ఈ నేపథ్యంలో పృథ్వీషా (2 టెస్టులు), మయాంక్‌ అగర్వాల్‌ (9 టెస్టులు) భారత్‌ తరఫున ఓపెనింగ్‌ చేయనున్నారు.

‘గాయాల వల్ల టీమ్‌ఇండియాకు కొందరు ఆటగాళ్లు దూరమయ్యారు. ఐతే టెస్టులు ఆడగల సామర్థ్యం ఉన్న ప్రతిభావంతులు ఆ జట్టులో ఉన్నారు. వారు హామిల్టన్‌లో చక్కగా ఆడారు. అనుభవం లేకపోవచ్చేమో గానీ వారిది అద్భుతమైన క్లాస్‌. సొంతగడ్డపై ఆడటం మాకు సానుకూలం. ఐతే మేం రాణించాల్సిన విభాగాలు మిగిలున్నాయి. భారత్‌ త్వరగానే ఇక్కడి పరిస్థితులకు అలవాటు పడుతుంది’ అని సౌథీ అన్నాడు.

ఐసీసీ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో అగ్రస్థానంలో కొనసాగుతున్న టీమ్‌ఇండియాను తాము గౌరవిస్తారని సౌథీ తెలిపాడు. ‘ఈ ఫార్మాట్‌ భిన్నమైంది. సుదీర్ఘ కాలంగా టెస్టు క్రికెట్‌ను భారత్‌ స్థిరంగా ఆడుతోంది. అందుకే రెండు జట్ల మధ్య పోటీ తీవ్రంగా ఉంటుంది. ట్రెంట్‌బౌల్ట్‌తో కలిసి చాలాకాలంగా నేను కొత్త బంతి పంచుకుంటున్నాను. మేమిద్దరం ఒకర్నొకరం ప్రోత్సహించుకుంటాం. మాది విజయవంతమైన కుడి-ఎడమ చేతివాటం. మేమిద్దరం బంతిని స్వింగ్‌ చేయగలం. మా నైపుణ్యాలేంటో ఇద్దరికీ తెలుసు. ఇదే భాగస్వామ్యాన్ని మేమిద్దరం కొనసాగిస్తాం’ అని అతడు అన్నాడు.


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.