close
Array ( ) 1

తాజా వార్తలు

Published : 20/04/2020 23:25 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

క్యూ4 ఫలితాల్లో ఇన్ఫోసిస్‌ జోరు

దిల్లీ: దేశంలోనే రెండో అతిపెద్ద ఐటీ రంగ సంస్థ ఇన్ఫోసిస్‌ మార్చితో ముగిసిన నాలుగో త్రైమాసిక ఫలితాల్లో 6.3 శాతం నికర లాభాన్ని నమోదు చేసినట్లు ప్రకటిచింది. అంతక్రితం ఏడాది ఇదే సమయంలో రూ.4,078 కోట్ల ఏకీకృత నికర లాభం ఉండగా ఈ ఏడాది నికర లాభం రూ.4,335 కోట్లకు పెరిగింది. కరోనా ప్రభావం వల్ల నెలకొన్న వ్యాపార అనిశ్చితి కారణంగా వచ్చే ఏడాదికి సంబంధించి ఆదాయాలను అంచనాలు వేయలేకపోతున్నామని వెల్లడించింది.

మార్చితో ముగిసిన త్రైమాసికంలో సంస్థ ఆదాయం 8 శాతం మేర పెరిగి రూ.23,267 కోట్లకు చేరుకున్నట్లు ఎక్స్ఛేంజీలకు ఇచ్చిన సమాచారంలో తెలిపింది. గతేడాది ఇదే త్రైమాసికంలో సంస్థ ఆదాయం రూ.21,539 కోట్లుగా కంపెనీ వెల్లడించింది. ఈ ఏడాది తమ ఉద్యోగులకు ఎలాంటి వేతనాల పెంపు, ప్రమోషన్లు ఉండబోవని కంపెనీ స్పష్టంచేసింది. భవిష్యత్‌లో చేపట్టబోయే నియామకాలు ఫ్రెషర్లకే అవకాశం కల్పిస్తామని వెల్లడించింది. మొత్తంగా గత ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన నికర లాభం 8 శాతం పెరిగి రూ.16,639 కోట్లకు చేరుకోగా, ఆదాయం 9.8 శాతం పెరిగి రూ. 90,791 కోట్లకు చేరుకుంది. గత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఒక్కో ఈక్విటీ షేరుకు రూ.9.50 డివిడెండ్‌ ఇవ్వనున్నట్లు ఇన్ఫోసిస్‌ ప్రకటించింది.


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.