close

తాజా వార్తలు

బెంగాల్‌లో ఐదు జిల్లాల్లో ఇంటర్నెట్‌ బంద్‌

కోల్‌కతా: పౌరసత్వ సవరణ చట్టంపై ఆందోళనలు పశ్చిమ బెంగాల్‌కు సైతం తాకిన నేపథ్యంలో ఆ రాష్ట్రంలోని ఐదు జిల్లాల్లో ఇంటర్నెట్‌ సేవలను తాత్కాలికంగా నిలిపివేశారు. మాల్దా, ముర్షీదాబాద్‌, హౌవ్‌డా, నార్త్‌ 24 పరగణా, సౌత్‌ 24 పరగణా జిల్లాల్లో ఈ సేవలను నిలిపివేసినట్లు అధికార వర్గాలు ఆదివారం తెలిపాయి.  సోషల్‌మీడియాలో తప్పుడు వార్తలు, అసత్య ప్రచారాలు నిరోధానికే ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.

ఎప్పటి వరకు ఇంటర్నెట్‌ సేవలను నిలిపివేస్తున్నదీ అధికారులు చెప్పలేదు. ముర్షీదాబాద్‌లో ఐదు ఖాళీ రైళ్లకు నిప్పు పెట్టిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. మరోవైపు పౌరసత్వ చట్టంపై ఆందోళనలు ఈశాన్య రాష్ట్రాల్లో కొనసాగుతున్నాయి. అసోంలోని 10 జిల్లాల్లో సోమవారం వరకు ఇంటర్నెట్‌ సేవలను నిలిపివేశారు. పలు చోట్ల కర్ఫ్యూ కొనసాగుతోంది.


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.