close
Array ( ) 1

తాజా వార్తలు

మే 24న ఐపీఎల్‌ 2020 ఫైనల్‌

ముంబయి: ఐపీఎల్‌ 2020 ఫైనల్‌ మ్యాచ్‌ మే 24న జరుగుతుందని సమాచారం. వాంఖడే వేదికగా మార్చి 29న మొదటి మ్యాచ్‌ జరగనుంది. అంటే మొత్తం 57 రోజులు పొట్టి క్రికెట్‌ అభిమానులను కనువిందు చేయనుందన్న మాట. ఐపీఎల్‌ ప్రసారదారు కోరిక మేరకు మ్యాచ్‌లను అరగంట ముందుగా రాత్రి 7:30 గంటలకు మొదలుపెట్టడం లాంఛనమే అనిపిస్తోంది. రోజుకు ఒక్కమ్యాచే ఉంటుందని అభిజ్ఞవర్గాలు తెలిపాయి.

‘ఐపీఎల్‌ మ్యాచ్‌ల పూర్తి షెడ్యూలు ఇంకా సిద్ధమవ్వనప్పటికీ ఫైనల్‌ మాత్రం మే 24న నిర్వహిస్తారు. టోర్నీ మార్చి 29న ఆరంభమవుతుంది. అంటే 45 రోజుల కన్నా ఎక్కువ సమయం ఉండటంతో రోజుకు ఒక మ్యాచ్‌ నిర్వహించేందుకు ఇబ్బందేమీ ఉండదు. నిజానికి 57 రోజులు మ్యాచులు నిర్వహించడం చాలా తేలిక. టీఆర్పీ రేటింగ్‌తోనే అసలు సమస్య. ఆట ఆలస్యమవ్వడమూ ఒక కారణమే. అప్పుడు స్టేడియాలకు వచ్చిన వారు ఇంటికి వెళ్లడమూ ఇబ్బందిగా మారుతోంది. చర్చలు ఇంకా జరుగుతున్నప్పటికీ మ్యాచ్‌లు రాత్రి 7:30 గంటలకు ఆరంభం కావొచ్చు’ అని తెలుస్తోంది.

‘దిల్లీ, ముంబయి, బెంగళూరు లాంటి మెట్రో నగరాల్లో కార్యాలయాల నుంచి ఉద్యోగులు సాయంత్రం 6 గంటలకు బయలుదేరి ఇంటికెళ్లడం ఎంత కష్టమో తెలిసిందే. మ్యాచ్‌లు ముందుగా ప్రారంభమైతే కుటుంబ సభ్యులతో కలిసి వారు స్టేడియాలకు వస్తారో? లేదోనని ఫ్రాంచైజీల బెంగ. వారి ఉద్దేశమూ సరైందే. ఆరంభ సమయాన్ని ముందుకు జరిపేముందు ఇవన్నీ పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది. ఐతే సాయంత్రం 4 గంటల మ్యాచులకు టీఆర్పీ రేటింగ్స్‌ ఉండటం లేదు. అభిమానులూ హాజరు కావడం లేదు. అందుకే వాటిని రద్దు చేసేందుకు ఇబ్బందేమీ లేదు’ అని ఆ వర్గాలు అంటున్నాయి.


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.