
తాజా వార్తలు
విమర్శలు ఎదుర్కోవడానికి సిద్ధంగా లేను
ఆటోబయోగ్రఫీ నిలిపివేసే ఆలోచనలో స్టార్హీరో
ముంబయి: తన జీవితచరిత్రను అందరూ చదువుకునే విధంగా త్వరలో అందుబాటులోకి తీసుకువస్తానని ఇటీవల బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీఖాన్ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఇప్పట్లో ఆటోబయోగ్రఫీని రచించే ఉద్దేశం తనకి లేదని తాజాగా ఆయన వెల్లడించారు. ప్రస్తుతం జాక్వెలిన్‌తో కలిసి ‘భూత్ పోలీస్’ సినిమా షూటింగ్లో పాల్గొంటున్న ఆయన ఆటోబయోగ్రఫీకి సంబంధించిన కొన్ని ఆసక్తికర విషయాలను ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు.
‘నా ఆటోబయోగ్రఫీని అందరికీ అందుబాటులోకి తీసుకురావాలని మొదట్లో భావించాను. నా జీవితానికి సంబంధించి ఎవరికీ తెలియని ఎన్నో విషయాలను దానిలో పొందుపరచాలనుకున్నాను. ఆటోబయోగ్రఫీ విషయంలో నిజాయతీగా ఉండాలనేది నా ఉద్దేశం. దానివల్ల సమాజంలోని కొంతమంది ఇబ్బందిపడే అవకాశం ఉంది. బయోగ్రఫీ చదివాక పలువురు నాపై విమర్శనాస్త్రాలు సంధించవచ్చు. ప్రస్తుతానికి విమర్శలు ఎదుర్కొనేందుకు నేను సిద్ధంగా లేను. అంతేకాకుండా అన్ని విషయాలను నెగెటివ్‌గా తీసుకునే ఎంతోమందికి.. నా జీవితం గురించి తెలియజేయడం నాకు ఇష్టం లేదు. ఒకవేళ భవిష్యత్తులో బయోగ్రఫీ ఉండొచ్చు లేదా ఉండకపోవచ్చు కూడా’ అని సైఫ్ వివరించారు.
సినిమా
రాజకీయం
జనరల్
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
చిత్ర వార్తలు
సినిమా
- ట్రంప్ వీడ్కోలు: చాలా అందంగా ఉంది
- రాధికా ఆంటీ.. నా సీక్రెట్స్ బయటపెట్టేస్తుంది..!
- నల్గొండ జిల్లాలో ఘోరప్రమాదం: 9 మంది మృతి
- సిడ్నీ టెస్టు కాగానే ద్రవిడ్ సందేశం పంపించారు
- ట్రంప్‌కు టిమ్ కుక్ గిఫ్ట్.. ఏంటో తెలుసా..?
- మద్యం మత్తులో నగ్నంగా చిందేసిన యువతి
- ఎవరూ దొరక్కపోతే స్మిత్‌కే సారథ్యం!
- డీఎం సాబ్.. నేను తేజస్వి మాట్లాడుతున్నా..
- నచ్చింది దొరికిందట.. పోజులిస్తున్న అనుపమ
- ఆర్సీబీ నిర్ణయంపై పార్థివ్ పటేల్ జోక్..
ఎక్కువ మంది చదివినవి (Most Read)
