బిహార్‌ బరిలో శివసేన?
close

తాజా వార్తలు

Published : 26/09/2020 16:01 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

బిహార్‌ బరిలో శివసేన?

రెండుమూడు రోజుల్లో నిర్ణయం!

పట్నా: బిహార్‌ అసెంబ్లీ ఎన్నికల వాతావరణం వేడెక్కుతోంది. మూడు విడతల్లో ఎన్నికలు నిర్వహించాలని కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించిన తర్వాతి రోజు నుంచే నేతలు విమర్శలకు పదును పెడుతున్నారు. బాలీవుడ్‌ నటుడు సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పూత్‌ మృతి వ్యవహారాన్ని పావుగా వాడుకోవాలని బిహార్‌లో నేతలు చూస్తున్నారన్న ఊహాగానాలు వినిపిస్తున్న నేపథ్యంలో శివసేన ఎంపీ సంజయ్‌రౌత్‌ స్పందించారు. అభివృద్ధి, శాంతిభద్రతలు, పరిపాలన తదితర సమస్యల పరిష్కారమే అజెండాగా బిహార్‌ ఎన్నికలు జరగాలని, తీర్చడానికి సమస్యలు లేవని అక్కడి నేతలు భావిస్తే.. ప్రజా సమస్యలను ముంబయి నుంచి పార్సిల్‌లో పంపిస్తామని ఆయన వ్యాఖ్యానించారు.

అంతేకాకుండా బిహార్‌ ఎన్నికల్లో శివసేన పోటీ చేయనుందని పరోక్షంగా చెప్పారు. దీనిపై పార్టీ అగ్రనేత ఉద్ధవ్‌ ఠాక్రే రెండు మూడు రోజుల్లో నిర్ణయం తీసుకుంటారన్నారు. బిహార్‌లో ఎన్నికలు కులాలకు మధ్య జరగబోయే పోటీయే తప్ప, వ్యవయసాయ బిల్లులు, రైతులు హక్కులాంటి అంశాలు ఎన్నికలపై ప్రభావం చూపబోవని పరోక్షంగా అధికార భాజపా-జేడీయూ ప్రభుత్వాన్ని విమర్శించారు. గత జూన్‌ 14న సుశాంత్‌సింగ్‌ రాజ్‌పూత్‌ మృతిచెందిన తర్వాత ఇటు బిహార్‌, అటు ముంబయి పోలీసులిద్దరూ కేసుపై విచారణ చేపడుతున్న విషయం తెలిసిందే. అయితే మహారాష్ట్ర పోలీసులు సహకరించడం లేదని బిహార్‌ మాజీ డీజీపీ గుప్తేశ్వర్‌ పాండే ఆరోపించారు. ఆయన రాజకీయాల్లోకి రావాలని చూస్తున్నారని, అందుకే స్వచ్ఛంద పదవీవిరమణ తీసుకున్నారన్న ఊహాగానాలూ వినిపిస్తున్నాయి.

మొత్తం 243 అసెంబ్లీ స్థానాలకు 3 దశల్లో ఎన్నికలు (అక్టోబరు 28, నవంబరు 3, 7) నిర్వహించడానికి కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయించింది. నవంబర్‌ 10న ఓట్ల లెక్కింపు ఉంటుంది. 7.29 కోట్ల మంది ఓటర్లున్న బిహార్‌లో అసెంబ్లీ ఎన్నికల ప్రణాళికను ప్రధాన ఎన్నికల కమిషనర్‌ (సీఈసీ) సునీల్‌ అరోడా శుక్రవారం దిల్లీలో నిర్వహించిన విలేకర్ల సమావేశంలో వెల్లడించారు. కొవిడ్‌ సమయంలో ప్రపంచంలో నిర్వహిస్తున్న అతి పెద్ద ఎన్నికలు ఇవేనని ఆయన అభివర్ణించారు. బిహార్‌ శాసనసభ కాలపరిమితి నవంబరు 29తో ముగియనుంది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని