close
Array ( [0] => stdClass Object ( [video_news_id] => 120020163 [video_srlno] => 1 [video_type] => 1 [video_link] => sar5DJEs0PA [video_short_link] => sar5DJEs0PA [created_by] => [created_date] => [modified_by] => 8914230 [modified_date] => 2020-02-11 16:32:27.200572 [display_status] => 1 [video_isdeleted] => ) ) 1

తాజా వార్తలు

లవ్‌యూ దిల్లీ.. ఇది భారతావని విజయం

ఫలితాలపై అరవింద్‌ కేజ్రీవాల్‌ హర్షం

దిల్లీ: అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్‌ ఆద్మీ పార్టీ మరోసారి ఊడ్చేసింది. ఈ ఫలితాలపై పార్టీ కన్వీనర్‌ అరవింద్‌ కేజ్రీవాల్‌ ఆనందం వ్యక్తం చేశారు. తనను కొడుకుగా భావించి ప్రజలు ఓటేశారని, ఇది వారి విజయమేనంటూ దిల్లీ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. ఫలితాల అనంతరం ఆయన పార్టీ కార్యకర్తలనుద్దేశించి ప్రసంగించారు. 

‘ఆమ్‌ ఆద్మీపై విశ్వాసం ఉంచి మూడోసారి గెలిపించిన దిల్లీ ప్రజలకు కృతజ్ఞతలు. ఐ లవ్‌యూ దిల్లీ. ఇది యావత్ భారతావని విజయం. దిల్లీ ప్రజలు సరికొత్త తీర్పు ఇచ్చారు. దిల్లీలో ‘పని రాజకీయం’ పురుడు పోసుకుంది. ప్రజలకు కల్పించిన సౌకర్యాలే మాకు గెలుపు బాటలు పరిచాయి. సామాన్యుడి కోసం అమలు చేసిన సంక్షేమ పథకాలు, విద్యుత్‌, నీటిసరఫరా, పౌరసేవలే మమ్మల్ని గెలిపించాయి. విద్య, వైద్యం కోసం మేం చేసిన కృషిని గుర్తించి ప్రజలు మమ్మల్ని ఆదరించారు. మరో అవకాశం కల్పించారు. మరో ఐదేళ్ల పాటు మనమంతా కలిసి పనిచేద్దాం’ అని కేజ్రీవాల్‌ అన్నారు. 

ఈ సందర్భంగా భార్య సునీత కేజ్రీవాల్‌, భగవాన్‌ హనుమాన్‌కు కేజ్రీవాల్‌ ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. తమను సరైన మార్గంలో నడిపించాలని నిత్యం హనుమంతుడికి ప్రార్థనలు చేశామని, దాని వల్లే ప్రజలకు మరో ఐదేళ్ల పాటు సేవ చేసే అవకాశం లభించిందన్నారు. 

 



Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
సినిమా

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.