ఫుట్‌బాల్‌ దిగ్గజం పాలోరోజీ కన్నుమూత
close

తాజా వార్తలు

Updated : 10/12/2020 11:29 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఫుట్‌బాల్‌ దిగ్గజం పాలోరోజీ కన్నుమూత

ఇంటర్నెట్‌డెస్క్‌: 1982 ఫుట్‌బాల్‌ ప్రపంచకప్‌ విజేత సభ్యుడు, ఇటలీ దిగ్గజం పాలోరోజీ(64) గురువారం తెల్లవారుజామున కన్నుమూశాడు. ఆయన పనిచేస్తున్న ఆర్‌ఏఐ స్పోర్ట్స్‌ వార్తా సంస్థ ఈ విషయాన్ని ట్వీట్‌ చేసి వెల్లడించింది. 1982 స్పెయిన్‌లో జరిగిన సాకర్‌ ప్రపంచకప్‌లో రోజీ ఆరు గోల్స్‌ సాధించి ప్రపంచ వ్యాప్తంగా విశేషమైన అభిమానుల్ని సొంతం చేసుకున్నాడు. లీగ్‌ దశలో బ్రెజిల్ ‌పై హ్యాట్రిక్‌ సాధించిన అతడు తర్వాత సెమీఫైనల్స్‌లో పొలాండ్‌పై 2 గోల్స్‌ కొట్టాడు. ఇక వెస్ట్‌ జర్మనీతో తలపడిన ఫైనల్లో తొలి గోల్‌ ఆయనే సాధించాడు. దాంతో ఇటలీ 3-1 తేడాతో వెస్ట్‌ జర్మనీపై విజయం సాధించింది. ఇదిలా ఉండగా, పాలోరోజీ జువాంటస్‌ జట్టు తరఫున నాలుగేళ్లు ఆడి రెండుసార్లు ‘ఇటాలియన్‌ సిరీస్-ఏ’ టైటిళ్లు అందించాడు. ఒక యూరోపియన్‌ కప్‌ను అందించాడు. అనంతరం స్పాట్‌ ఫిక్సింగ్‌ కేసులో చిక్కుకొని రెండేళ్ల పాటు ఆటకు దూరమయ్యాడు. గురువారం ఉదయం రోజీ మరణించిన కొద్దిసేపటికే సతీమణి కాపెల్లీ ఫెడెరికా ఇన్‌స్టాగ్రామ్‌లో తన భర్తతో దిగిన ఫొటోను పంచుకొని ‘Forever’ అని పేర్కొంది. అయితే, అతడి మృతికి గల కారణాలను వెల్లడించలేదు. ఫుట్‌బాల్‌ దిగ్గజం డీగో మారడోనా మరణించిన కొద్దిరోజులకే రోజీ మృతిచెందడం ఫుట్‌బాల్‌ అభిమానులను కలచివేస్తోంది.

ఇదీ చదవండి..

 ‘కింగ్‌కోహ్లీ’.. భూమ్మీద బిజీ క్రికెటర్‌! 

కరోనాను ఐపీఎల్ దాటేసింది


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని