close
Array ( [0] => stdClass Object ( [video_news_id] => 120035609 [video_srlno] => 1 [video_type] => 3 [video_link] => 1237746266936926210 [video_short_link] => 1237746266936926210 [created_by] => [created_date] => [modified_by] => 9823211 [modified_date] => 2020-03-14 13:55:50.352339 [display_status] => 1 [video_isdeleted] => ) ) 1

తాజా వార్తలు

Published : 14/03/2020 14:49 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

కరోనాను ‘దూరంగా’ ఉంచేది మరీ ఇలానా?

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రపంచ ఆరోగ్య సంస్థ కరోనా వైరస్‌ (కొవిడ్‌-19)ను మహమ్మారిగా గుర్తించింది. దీని నివారణకు తీసుకోవాల్సిన చర్యల్లో తగినంత సామాజిక దూరాన్ని పాటించటం కూడా ఒకటని ప్రకటించింది. అయితే ఈ సూచనను మరీ సీరియస్‌గా తీసుకున్న ఓ ఇటలీ వ్యక్తి చర్య, సామాజిక మాధ్యమాల్లో నవ్వులు పూయిస్తోంది.

ఆ దేశంలో 15,000 పైగా కరోనా కేసులు నమోదైన తరుణంలో...ఆహార, ఔషధ దుకాణాలను తప్ప మిగిలిన అన్నింటిని మూసివేయాలని ఇటలీ ప్రభుత్వం నిర్ణయించింది. దీనితో వివిధ మార్కెట్లలో తమకు అవసరమైన వస్తువుల కొనుగోలుకు అక్కడి ప్రజలు క్యూలు కట్టారు. ఈ నేపథ్యంలో ఓ వ్యక్తి గుండ్రంగా ఉన్న వెడల్పాటి కప్ బోర్డును తన చుట్టూ ధరించి రోమ్‌ నగరంలోని టెస్టాక్కియో మార్కెట్‌ వీధులలో తిరగసాగాడు. ఈ వింత చూసి ఆశ్చర్యపోవటం అక్కడి ప్రజల వంతయింది.

తలో ఎవరో అతన్ని ‘‘ఇది దేని నుంచి రక్షణకోసం?’’ అని ప్రశ్నించగా, ‘‘కరోనా వైరస్‌ నుంచి’’ అని ఆ వ్యక్తి సమాధానం చెప్పాడు. మరీ ఇంత జాగ్రత్తా? అని అనేక మంది నిష్ఠూరంగా అన్నా, పరిస్థితి తీవ్రతను బట్టి సమంజసమే అని పలువురు అభిప్రాయపడుతున్నారు. మరి ఈ వింత వీడియోను మీరూ చూడండి...

 



Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
సినిమా
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.