close
Array ( ) 1

తాజా వార్తలు

Published : 17/04/2020 01:22 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

అప్పటి వరకు ఐపీఎల్‌ వాయిదా: బీసీసీఐ

ముంబయి: ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ తాజా సీజన్‌పై నీలిమబ్బులు కమ్ముకుంటున్నాయి. ఈ సీజన్‌ను రద్దు చేయక తప్పని పరిస్థితులు చోటు చేసుకుంటున్నాయి. ప్రధాని నరేంద్రమోదీ దేశవ్యాప్త లాక్‌డౌన్‌ను మే 3 వరకు పొడగించారు. ఈ నేపథ్యంలో మళ్లీ నోటీసులు జారీ చేసేంత వరకు ఐపీఎల్‌ను వాయిదా వేస్తున్నామని బీసీసీఐ అధికారికంగా ప్రకటించింది.

‘కొవిడ్‌ వైరస్‌ను కట్టడి చేసేందుకు భారత ప్రభుత్వం లాక్‌డౌన్‌ను పొడిగించింది. ఈ నేపథ్యంలో మళ్లీ నోటీసులు జారీ చేసేంతవరకు ఐపీఎల్‌-2020ని వాయిదా వేయాలని బీసీసీఐ నిర్ణయించింది’ అని బోర్డు కార్యదర్శి జే షా ప్రకటించారు. దేశంలో క్రికెట్‌ను ఎప్పుడు పునరుద్ధరిస్తారని ప్రశ్నించగా ‘ఎప్పుడు ఆరంభించాలన్న దానిపై కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర సంఘాలతో కలిసి బీసీసీఐ నిరంతరం సమీక్షిస్తుంది. ఆ తర్వాతే నిర్ణయం ఉంటుంది’ అని ఆయన పేర్కొన్నారు.

మొదట ఐపీఎల్‌ను ఏప్రిల్‌ 15కు వాయిదా వేశారు. లాక్‌డౌన్‌ను పొడగించడంతో మళ్లీ నోటీసులు ఇచ్చేంతవరకు సీజన్‌ను నిరవధికంగా వాయిదా వేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో బీసీసీఐకి సెప్టెంబర్‌-నవంబర్‌ విండో మాత్రమే మిగిలింది. అప్పుడు సీజన్‌ను ఆరంభించాలన్నా దుబాయ్‌లో ఆసియా కప్‌కు దూరమవ్వాలి.


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.