close

తాజా వార్తలు

Updated : 21/08/2020 20:08 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

24నుంచి జేఎన్‌టీయూహెచ్‌ ఆన్‌లైన్‌ తరగతులు

హైదరాబాద్‌: కరోనా వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో అకడమిక్‌ పరంగా విద్యార్థులకు ఎలాంటి నష్టం వాటిల్లకుండా జేఎన్‌టీయూహెచ్‌ ఇంజినీరింగ్‌ విద్యాసంవత్సరాన్ని ఖరారు చేసింది. బీటెక్, బీఫార్మసీ కోర్సులు చదువుతున్న విద్యార్థులకు ఈ నెల 24 నుంచి ఆన్‌లైన్‌ తరగతులు నిర్వహించాలని నిర్ణయించింది. అక్టోబర్‌ 18 నుంచి 24 వరకు దసరా సెలవులు ప్రకటించనున్నారు.
ముఖ్యమైన తేదీలు 

* జనవరి 11 నుంచి జనవరి 23 వరకు సెమిస్టర్ పరీక్షలు.

* జనవరి 25 నుంచి రెండో సెమిస్టర్ ప్రారంభం

* మే 7 నుంచి జూన్ 19 వరకు సెమిస్టర్ పరీక్షలు

* జూన్ 21 నుంచి జూలై 10 వరకు వేసవి సెలవులు

మరోవైపు సిలబస్‌లో ఎలాంటి మార్పులు ఉండబోవని రిజిస్ట్రార్‌ మన్‌జూర్‌ హుస్సేన్‌ స్పష్టం చేశారు. 
సెప్టెంబర్ 16 నుంచి చివరి సెమిస్టర్ పరీక్షలు నిర్వహిస్తామన్నారు. ఎంటెక్, ఎంఫార్మసీ, ఎంబీఏ కోర్సులకు సంబంధించిన విద్యాసంవత్సర ప్రణాళికను త్వరలోనే ఖరారు చేస్తామన్నారు.


 


 

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని