close

తాజా వార్తలు

Updated : 05/01/2020 08:33 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

‘రాహుల్‌ సీఏఏపై పది పాయింట్లు చెప్పగలరా?’

గువహటి: భాజపా జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడు జేపీ నడ్డా పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ) విషయంలో కాంగ్రెస్‌ నాయకుడు రాహుల్‌గాంధీపై తీవ్ర విమర్శలు చేశారు. సీఏఏ వల్ల భారత పౌరులకు కలిగే సమస్యలేమిటో రాహుల్‌గాంధీ ముందుకు వచ్చి సరిగ్గా పది పాయింట్లు మాట్లాడాలని సవాల్‌ విసిరారు. అసోంలోని గువాహటిలో శనివారం నిర్వహించిన బహిరంగ సభలో నడ్డా మాట్లాడారు. ‘మతపరమైన హింస కారణంగా మిలియన్ల మంది ప్రజలు రాత్రికి రాత్రి దేశాన్ని మారవల్సి వచ్చింది. అఫ్గనిస్థాన్‌లో గతంలో 50వేల మంది సిక్కులు ఉండగా ప్రస్తుతం కేవలం 2వేల మంది మాత్రమే మిగిలారు.. వారంతా ఎక్కడికి వెళ్లారు? నాకు అన్ని ప్రాంతాల సంస్కృతి, సంప్రదాయాలు నాకు తెలుసు. ప్రజల మనోభావాలు, భాషలను నేను అర్థం చేసుకోగలను. అసోం ప్రజల సంస్కృతి, సంప్రదాయాలు, భాషను కాపాడటం మా బాధ్యత దాన్ని మేము నిర్వర్తిస్తాం. సీఏఏపై ఆరోపణలు చేస్తున్న కాంగ్రెస్‌ నేత రాహుల్‌గాంధీ ముందుకు వచ్చి ఆ చట్టంపై 10 పాయింట్లు చెప్పాలని, దాని వల్ల భారత పౌరులకు వచ్చే సమస్యలేమిటో చెప్పాలి. 1985లో జరిగిన అసోం ఒప్పందంలోని ఆరవ షెడ్యూల్‌ను ప్రభుత్వం కాపాడుతుంది’ అని నడ్డా హామీ ఇచ్చారు. 


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని