close

తాజా వార్తలు

Published : 24/11/2020 02:02 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

దిల్లీ వెళ్లిన పవన్‌కల్యాణ్‌

హైదరాబాద్‌: జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ దిల్లీ వెళ్లారు. ఆ పార్టీ నేత నాదెండ్ల మనోహర్‌తో కలిసి హస్తినకు పయనమయ్యారు. రేపు ఉదయం భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో పవన్‌ భేటీ కానున్నారు. తెలుగు రాష్ట్రాల్లో తాజా రాజకీయ పరిస్థితులు, ఇరు పార్టీల సమన్వయం, పోలవరం ప్రాజెక్టు, రాజధాని అమరావతి వ్యవహారాలపై కీలకంగా చర్చించే అవకాశముంది. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో జనసేన, భాజపాతో కలిసి పనిచేసే అంశంపైనా చర్చ జరగనున్నట్లు సమాచారం. ఈ భేటీలో భాజపా ఏపీ వ్యవహారాల ఇన్‌ఛార్జ్‌ మురళీధరన్‌ కూడా పాల్గొనే అవకాశముంది.

 


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

చిత్ర వార్తలు

సినిమా
మరిన్ని

దేవతార్చన