close

తాజా వార్తలు

Published : 28/11/2020 00:23 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

‘నివర్‌’ బాధిత రైతులను ఆదుకోవాలి:పవన్‌

అమరావతి‌: నివర్‌ తుపాను ప్రభావంతో రాష్ట్రంలో రైతులు తీవ్రంగా నష్టపోవడం దురదృష్టకరమని జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ ఆవేదన వ్యక్తం చేశారు. క్షే్త్రస్థాయి సమాచారం ప్రకారం సుమారు రూ.వెయ్యి కోట్ల మేర పంటనష్టం జరిగినట్లు తెలిసిందన్నారు. ఈ పరిస్థితుల్లో రైతులను అన్నివిధాలా ఆదుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉందని చెప్పారు. ఈ మేరకు పవన్‌ ఓ ప్రకటన విడుదల చేశారు. పంటలు చేతికొచ్చే సమయంలో ప్రకృతి విపత్తుతో రైతులు నష్టపోయారన్నారు. అప్పులపాలవుతున్న రైతులను మరింత కుంగదీసేలా ఈ నష్టాలు ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. 

పెట్టుబడి రాయితీతోపాటు పంటల బీమాను సకాలంలో అందించడం చాలా అవసరమని పవన్‌ అభిప్రాయపడ్డారు. గతేడాది ఖరీఫ్, రబీ పంటల నష్టానికి సంబంధించిన బీమా మొత్తాలు ఇప్పటికీ దెబ్బతిన్న రైతులకు అందలేదని.. ఈ విషయంలో వ్యవసాయశాఖ తగిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ప్రకృతి విపత్తుల వల్ల ఈ ఏడాది పంటలు కోల్పోయిన రైతులకు విత్తనాలు, ఎరువులు ఉచితంగా అందజేస్తే వ్యవసాయం చేసేవారికి ధీమా కలుగుతుందన్నారు. నివర్ తుపానుతో నిరాశ్రయులుగా మిగిలిన వారిని తక్షణమే ఆదుకొనేలా ప్రభుత్వం చర్యలు చేపట్టి బాధితులకు ఉపశమనం కలిగించాలని ప్రభుత్వాన్ని పవన్‌ కోరారు.


Tags :

రాజకీయం

జిల్లా వార్తలు
బిజినెస్‌
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
క్రైమ్
మరిన్ని