close

తాజా వార్తలు

Published : 19/11/2020 17:10 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

నేనీ విషయం చెప్పానని పాండ్యకు చెప్పండి: బుమ్రా

ఇంటర్నెట్‌డెస్క్‌: ముంబయి ఇండియన్స్‌, టీమిండియా ఆటగాడు హార్దిక్‌ పాండ్య అంటే ఠక్కున గుర్తొచ్చేది అతడి బ్యాటింగ్‌. క్రీజులో ఉన్నంతసేపూ సిక్సుల వర్షమే. బౌలర్లను హడలెత్తిస్తూ స్కోరు బోర్డును పరుగులు పెట్టించడమే. మరి అలాంటి క్రికెటర్‌ గురించి ఒక్కమాటలో చెప్పాలంటే ఎవరైనా ఏమంటారు? ఏ హిట్టరనో.. ఆల్‌రౌండర్‌ అనో.. మ్యాచ్‌ ఫినిషనరనో అభివర్ణిస్తారు. అదే ముంబయి ఇండియన్స్‌ జట్టు సభ్యులను ఇదే ప్రశ్న అడిగితే ఏమంటారో తెలుసా..?

బ్యాటింగ్‌ కోచ్‌ మహేలా జయవర్దనేని ఈ ప్రశ్న అడిగితే ‘వ్యక్తిత్వం’ (క్యారెక్టర్‌) అని సమాధానం ఇచ్చాడు. ఆ జట్టు డైరెక్టర్‌ ఆఫ్‌ క్రికెట్‌ ఆపరేషన్స్‌ జహీర్‌ ఖాన్‌ను అడిగితే ‘శక్తి సామర్థ్యం’ అని బదులిచ్చాడు. బౌలింగ్ కోచ్‌ షేన్‌ బాండ్‌ అయితే అతడో ‘లెజెండ్’ అంటూ కొనియాడాడు. ఇక సహచర ఆటగాడు జస్ప్రీత్ ‌బుమ్రా మాత్రం హార్దిక్‌ అందగాడంటూ కితాబిచ్చాడు. తానూ విషయం చెప్పానని అతడికి చెప్పండని అన్నాడు. చివరగా ముంబయి బ్యాట్స్‌మన్‌ ఆదిత్య తారెను అడిగితే.. ‘రాక్‌స్టార్‌’తో  పోల్చాడు. ఈ వీడియోను ముంబయి టీమ్‌ తాజాగా ట్విటర్‌లో పంచుకుంది.



Tags :

స్పోర్ట్స్

జిల్లా వార్తలు
బిజినెస్‌
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
క్రైమ్
మరిన్ని