దిల్లీ ఎన్నికల్లో భాజపాతో ఎందుకు కలిశారు?
close

తాజా వార్తలు

Updated : 21/01/2020 14:46 IST

దిల్లీ ఎన్నికల్లో భాజపాతో ఎందుకు కలిశారు?

సీఎం నితీశ్‌ను ప్రశ్నించిన జేడీయూ నేత


పట్నా: దిల్లీ అసెంబ్లీ ఎన్నికల కోసం భాజపాతో కలిసి ఎందుకు పొత్తు పెట్టుకున్నారని జేడీయూ అధినేత, బిహార్‌ సీఎం నితీశ్‌కుమార్‌ను ఆ పార్టీ నేత, జనరల్‌ సెక్రటరీ పవన్‌ కె వర్మ ప్రశ్నించారు. ఈ మేరకు సీఎం నితీశ్‌కు బహిరంగ లేఖ రాశారు. దిల్లీలో భాజపాతో కలిసి పోటీ చేయడం తనను కలవరపరుస్తోందంటూ ఆయన సీఎంకు రాసిన లేఖను ట్వీట్‌ చేశారు. 

‘భాజపా-ఆర్‌ఎస్‌ఎస్‌ గురించి మీరు చాలా సందర్భాల్లో ఆందోళన వ్యక్తం చేశారు. భాజపాకు ఎంతో కాలంగా మిత్రపక్షంగా ఉంటున్న అకాళీ దళ్‌ దిల్లీ ఎన్నికల్లో ఆ పార్టీతో కలిసి పోటీ చేయడం లేదని ప్రకటించింది. మరి అలాంటిది ఇప్పుడు జేడీయూ బిహార్‌ను దాటి దిల్లీలో భాజపాతో పొత్తు ఎలా పెట్టుకుందో నాకు అర్థం కావడం లేదు. సీఏఏ, ఎన్‌పీఆర్‌, ఎన్నార్సీ పట్ల దేశమంతా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్న తరుణంలో దిల్లీ ఎన్నికల కోసం భాజపాతో జేడీయూ ఎందుకు పొత్తు పెట్టుకుంది’? అని జేడీయూ జనరల్‌ సెక్రటరీ వర్మ తన లేఖ ద్వారా నితీశ్‌ను ప్రశ్నించారు. ‘ఆర్‌ఎస్‌ఎస్‌ ముక్త్‌ భారత్‌ను తీసుకురావాలని మీరే పలుమార్లు పిలుపునిచ్చారు. నరేంద్రమోదీ తీసుకునే నిర్ణయాలు దేశానికి హాని కలిగిస్తున్నాయని మీరే చాలా సార్లు విమర్శించారు. అలాంటిది మీరు 2017లో భాజపాతో మళ్లీ పొత్తుకున్నారు. కానీ ఆ పార్టీ పట్ల మీకున్న భయాలు మాత్రం పోవడం లేదు కదా’ అని వర్మ తన లేఖలో పేర్కొన్నారు.


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని