కూలీపై రూ.3.5 కోట్ల జీఎస్టీ ఎగవేత కేసు
close

తాజా వార్తలు

Updated : 05/12/2020 20:07 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

కూలీపై రూ.3.5 కోట్ల జీఎస్టీ ఎగవేత కేసు

సదరు వ్యక్తిని చూసి ఆశ్చర్యపోయిన పోలీసులు

రాంచీ: కోట్ల రూపాయల పన్నులు ఎగవేసిన ఓ వ్యాపారవేత్తను అరెస్టు చేసేందుకు వెళ్లిన పోలీసులు సదరు వ్యక్తిని చూసి విస్మయానికి గురయ్యారు. రూ.3.5 కోట్లు ఎగ్గొట్టి విలాసంగా జీవిస్తున్నాడేమో అని భావించిన పోలీసులు అతడి ఆర్థిక పరిస్థితి చూసి కంగుతిన్నారు. రెక్కాడితే గానీ డొక్కాడని ఆ వ్యక్తి ప్రతిరోజు రూ.198 లభించే ఉపాధిహామీ పనికి వెళుతున్నట్లు గుర్తించారు. అయితే కోట్ల రూపాయల కేసులో తనను అరెస్టు చేయడంపై సదరు కూలీ ఆశ్చర్య పోవడంతో పాటూ ఆందోళనకు గురయ్యాడు.

 ఝార్ఖండ్‌లోని రాయ్‌పహారీ ప్రాంతానికి చెందిన లాదున్‌ ముర్ము (48) అనే వ్యక్తి పేరుతో ఎమ్‌ఎస్‌ స్టీల్‌ సంస్థ ఉంది. అయితే సదరు వ్యాపారవేత్త రూ.3.5 కోట్ల జీఎస్టీ కట్టలేదని గుర్తించిన అధికారులు గతేడాదే అతడి ఇంటికి నోటీసులు పంపించారు. అయినా ఎలాంటి స్పందన రాకపోవడంతో ఝార్ఖండ్‌ జీఎస్టీ విభాగం వారు లాదున్‌ ముర్ముపై కేసు నమోదు చేయించారు.

వ్యాపారవేత్త నమోదు చేసుకున్న చిరునామా ఆధారంగా రాయ్‌పురి గ్రామానికి చేరుకున్న పోలీసులు విస్మయానికి గురయ్యారు. అతడి ఆర్థిక పరిస్థితి అత్యంత దయనీయంగా ఉంది. చిన్న ఇంట్లో జీవిస్తూ ప్రతిరోజు ఉపాధిహామీ పథకం పనికి వెళుతున్నాడు. కాగా లాదున్‌ ముర్ముపై కేసు నమోదవడంతో పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. పూర్తి విచారణ చేపట్టిన పోలీసులు లాదున్‌ ఆధార్‌ కార్డు, పాన్‌కార్డు, బ్యాంకు పాస్‌బుక్‌ నకిలీలతో మరెవరో నకిలీ సంస్థను స్థాపించి ఈ మోసానికి పాల్పడినట్లు గుర్తించారు. కూలీ అరెస్టుతో గ్రామస్థులు ఆందోళన చేపట్టడంతో అతడిని విడుదల చేశారు. 2018లో తన ధ్రువీకరణ పత్రాలను తన మేనల్లుడికి ఇచ్చానని లాదున్‌ చెప్పడంతో ఆ దిశగా పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. 

ఇవీ చదవండి

మరోసారి లక్ష కోట్లు దాటిన జీఎస్టీ వసూళ్లు

నిఘా విభాగానికి చిక్కిన జీఎస్టీ అక్రమార్కులు


 


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని