కొవిడ్‌ వల్లే మా ఓటమి: జేడీయూ నేత
close

తాజా వార్తలు

Updated : 10/11/2020 10:37 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

కొవిడ్‌ వల్లే మా ఓటమి: జేడీయూ నేత

పట్నా: బిహార్‌ అసెంబ్లీ ఎన్నికల్లో అధికార జేడీయూ ఓటమిని అంగీకరించినట్లే కన్పిస్తోంది. ఇప్పటివరకు వెలువడిన ఫలితాల సరళిని చూస్తే.. ఎన్డీయే, మహాకూటమి ఆధిక్యాల్లో పోటాపోటీగా ఉన్నాయి. అయితే పార్టీల వారీగా జేడీయూ ఆధిక్యంలో మూడో స్థానంలో ఉంది. కాగా.. తాజా ఫలితాలపై ఆ పార్టీ సీనియర్ నేత కేసీ త్యాగి సంచలన వ్యాఖ్యలు చేశారు. కొవిడ్‌ వల్లే తాము ఓడిపోతున్నామని త్యాగి అన్నారు. 

‘ఏడాది కిందట జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో ఆర్జేడీ ఒక్క సీటు కూడా గెలవలేదు. ఆ ఫలితాలను బట్టి చూస్తే జేడీయూ, మిత్రపక్షం కలిసి 200లకు పైగా సీట్లలో గెలవాలి. అయితే కొవిడ్‌ 19 ప్రభావం వల్లే మేం ఓడిపోతున్నాం. అంతేగానీ ఆర్జేడీ వల్ల కాదు. ఈ ఏడాదిలో ఆర్జేడీ బ్రాండ్‌ ఏం పెరగలేదు. నితీశ్‌ పేరు ఏం తగ్గలేదు. అయితే ఎన్నికల్లో ప్రజల తీర్పును మేం స్వాగతిస్తున్నాం’ అని త్యాగీ జాతీయ మీడియాతో అన్నారు. ఈ సందర్భంగా ఎన్డీయే ఒకప్పటి మిత్రపక్షమైన ఎల్జేపీపై ఆయన విమర్శలు గుప్పించారు. బిహార్‌ రాజకీయాల్లో ఎల్జేపీ ప్రతికూల పాత్ర పోషించిందని దుయ్యబట్టారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని