సాగునీటి ఇబ్బందులపై కేసీఆర్‌ సమీక్ష
close

తాజా వార్తలు

Published : 12/07/2020 13:04 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

సాగునీటి ఇబ్బందులపై కేసీఆర్‌ సమీక్ష

హైదరాబాద్‌: ఎస్సారెస్పీ వరద కాల్వ ఎగువ ప్రాంతాలకు సాగునీరు అందించే విషయమై ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రగతిభవన్‌లో సమీక్ష నిర్వహించారు. మంత్రులు ప్రశాంత్‌రెడ్డి, కొప్పుల ఈశ్వర్‌రెడ్డితోపాటు, ప్రణాళిక సంఘం అధ్యక్షుడు వినోద్‌కుమార్‌, ఎమ్మెల్యేలు సంజయ్‌, విద్యాసాగర్‌రావు, రవిశంకర్‌, రమేశ్‌ తదితరులు పాల్గొన్నారు. వారితోపాటు జగిత్యాల, నిజమాబాద్‌ జిల్లాల ప్రజాప్రతినిధులు, ఇంజినీర్లు కూడా ఉన్నారు. ఎస్సారెస్సీ ఎగువన 50 వేల ఎకరాలకు సాగునీరు అందించే అంశంపై సమీక్షిస్తున్నారు. నాలుగు రోజుల క్రితం మేడిపల్లి, కథలాపూర్ మండలాల్లోని వరద కాలువ ఎగువ ప్రాంతాల్లో సాగునీటి ఇబ్బందులపై రైతు సమన్వయ సభ్యుడు శ్రీపాల్‌రెడ్డికి సీఎం కేసీఆర్‌ ఫోన్‌చేసి మాట్లాడిన సంగతి తెలిసిందే.


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని