close
Array ( ) 1

తాజా వార్తలు

Published : 03/06/2020 17:28 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

ఆ అలవాటు రైతుల్లో రావాలి: కేసీఆర్‌

నియంత్రిత  పంటల సాగుపై సీఎం విస్తృత సమీక్ష

హైదరాబాద్‌: మార్కెట్‌లో అమ్ముడుపోయే పంటలనే సాగుచేసే అలవాటు రైతుల్లో రావాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ అన్నారు. ఈ మేరకు వ్యవసాయ శాఖ నిరంతరం అప్రమత్తంగా ఉంటూ ప్రణాళికలు రూపొందించాలని ఆదేశించారు. రాష్ట్రంలో నియంత్రిత విధానంలో పంటల సాగు వ్యూహంపై మూడు రోజులు విస్తృతంగా చర్చించిన సీఎం కేసీఆర్‌ పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. పత్తి పరిశోధన, అభివృద్ధి కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని తీర్మానించారు. పత్తి నాణ్యతకు సంబంధించి అన్నదాతలకు అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు. జిన్నింగ్‌, స్పిన్నింగ్‌ మిల్లులకు సంబంధించి పూర్తి స్థాయిలో అధ్యయనం చేయాలన్నారు.

ఈసారి వర్షాకాలం పంటలో రాష్ట్రంలో నియంత్రిత పద్ధతిలోనే రైతులు పంటల సాగు చేపట్టాలని సూచించారు. నియంత్రిత సాగు ఏటా ప్రతి సీజన్‌లోనూ కొనసాగాలని స్పష్టం చేశారు. అమ్ముడయ్యే పంటలు వేయడం వల్ల వ్యవసాయం లాభసాటిగా మారుతుందని అభిప్రాయపడ్డారు. నియంత్రిత విధానం ద్వారా రైతుల పంటకు ధర రాని దుస్థితి ఉండదన్నారు. అన్నదాతలకు లాభం, వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకే ఈ ప్రయత్నమన్నారు. ప్రభుత్వ అధికారులు, రైతుల సహకారం ఉంటేనే ఈ ప్రయత్నాన్ని విజయవంతం చేయగలమని కేసీఆర్‌ వివరించారు.

దేశం, రాష్ట్రంలో ఆహార భద్రత సాధించినా పోషకాహార భద్రత సాధించలేదని సీఎం కేసీఆర్‌ అభిప్రాయపడ్డారు. ప్రజలు బలవర్థకమైన ఆహారం తీసుకోవడం లేదన్నారు. పోషకాహారం తినేలా ప్రజలను ప్రోత్సహించాలని.. అలాంటి పంటలు పండించేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ప్రజల జీవన ప్రమాణాలతో పాటు రోగ నిరోధక శక్తి కూడా పెరగాలన్నారు. మంచి పోషకాలున్న చిక్కుడు, మునగ ఎక్కువగా తినేలా ప్రజలను చైతన్య పరచాలన్నారు. పట్టణాల్లో పండ్లు, కూరగాల సాగుపై రైతులను ప్రోత్సహించాలని చెప్పారు. ఉల్లిగడ్డ విషయంలో అనిశ్చితి, కొరత లేకుండా పక్కా వ్యూహాన్ని అవలంబించాలని సీఎం కేసీఆర్‌ అధికారులను ఆదేశించారు.


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
సినిమా
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.