close
Array ( ) 1

తాజా వార్తలు

డ్రోన్‌ రేసులో సత్తా చాటిన కొరియా

బీజింగ్‌: బైక్‌ రేసింగ్‌, కార్ల రేసింగ్‌ గురించి విన్నాం.. బోటు రేసులను కూడా చూశాం.. కానీ ఎప్పుడైనా డ్రోన్ రేస్ గురించి విన్నారా? అందులోనూ వివిధ దేశాలు పోటీ పడతాయని.. ఛాంపియన్లు ఉంటారని ఎంతమందికి తెలుసు? అవును నిజమే.. చైనాలోని జియాంగ్​జిన్‌లో నిర్వహించిన ఎఫ్‌ఏఐ ప్రపంచ డ్రోన్‌ ఛాంపియన్‌షిప్‌ పోటీల్లో ఫైనల్‌ రేసులో కొరియాకు చెందిన చాంగ్​యాన్​జాంగ్ విజేతగా నిలిచాడు. పురుషుల జూనియర్ విభాగంలో జరిగిన తుదిపోరులో జేజాంగ్ కాంగ్, శామ్​హీప్స్‌లను ఓడించి రేసర్‌ చాంగ్​యాన్ ఛాంపియన్‌గా నిలిచాడు. అంతేకాకుండా టోర్నీ ఫైనల్లోనూ సత్తా చాటాడు. ఆస్ట్రేలియాకు చెందిన థామస్, ఫ్రాన్స్​ కిలియన్ రెండు, మూడు స్థానాలకు పరిమితమయ్యారు. మహిళల విభాగంలో థాయ్‌లాండ్‌కు చెందిన 13 ఏళ్ల వన్రాయ వన్నాపాంగ్ అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది. యూఎస్‌కు చెందిన సియూన్ పార్క్, టెంగ్ మాలు రెండు, మూడు స్థానాల్లో నిలిచారు.


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.