close

తాజా వార్తలు

Updated : 26/11/2020 12:11 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

తెరాస కార్పొరేటరే మేయర్‌: కేటీఆర్‌

హైదరాబాద్‌: భాజపా నేతల రెచ్చగొట్టే మాటలకు ఆగం కావొద్దని తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్‌ ప్రజలకు పిలుపునిచ్చారు. గ్రేటర్‌ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈసీఐఎల్‌ చౌరస్తా వద్ద నిర్వహించిన రోడ్‌షోలో ఆయన మాట్లాడారు. భాజపా నేతలు ఏది పడితే అదే మాట్లాడుతున్నారని ఆక్షేపించారు. ఆరేళ్లలో కేంద్రం నుంచి ఒక్కపైసా ఇవ్వనోళ్లు.. ఇప్పుడు ఇస్తారా అని ప్రశ్నించారు. తెరాస పక్కాలోకల్‌ పార్టీ అని.. మీ ఓటు గల్లీ పార్టీకా? దిల్లీ పార్టీకా? తేల్చుకోవాలన్నారు. కేంద్రంలో భాజపా అధికారంలోకి వస్తే నల్లధనాన్ని వెలికి తీస్తామని చెప్పి నల్లచట్టాలు తీసుకొచ్చారని కేటీఆర్ ఆరోపించారు. 

తమ నినాదం విశ్వనగరమని.. వాళ్లది విద్వేష నగరమని భాజపాను ఉద్దేశించి కేటీఆర్‌ విమర్శించారు. ఉద్వేగాలు కాదు ఉద్యోగాలు ముఖ్యమన్నారు. వచ్చే వారంపాటు మహిళలంతా సీరియళ్లు, సినిమాలు చూడకుండా భాజపా నేతల మాటలను టీవీల్లో చూడాలని.. కావాల్సిన వినోదాన్ని వారు పంచుతున్నారని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. వరదలు వచ్చినపుడు రాని కేంద్రమంత్రులు ఇప్పుడు  హైదరాబాద్‌కు వస్తున్నారని, రూ.1,350కోట్ల వరదసాయాన్ని కూడా తీసుకురావాలని కేటీఆర్‌ అన్నారు. వరద బాధితుల జాబితా పంపిస్తా.. రూ.25వేల సాయం ఇప్పించాలని కిషన్‌రెడ్డికి సవాల్‌ విసిరారు. ఎంఐఎంకు మేయర్‌ పదవి ఇస్తామంటూ తమపై భాజపా దుష్ప్రచారం చేస్తోందని.. తెరాస కార్పొరేటరే మేయర్‌గా ఉంటారని కేటీఆర్‌ స్పష్టం చేశారు. Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

చిత్ర వార్తలు

మరిన్ని

దేవతార్చన