గాలి కొనే పరిస్థితి రావొద్దు: కేటీఆర్‌
close

తాజా వార్తలు

Updated : 08/07/2020 14:19 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

గాలి కొనే పరిస్థితి రావొద్దు: కేటీఆర్‌

కరీంనగర్‌: మొక్కలు పెంచకుండా చెట్లను ఇష్టారాజ్యంగా నరకవద్దని మంత్రి కేటీఆర్‌ అన్నారు. ఇప్పుడు నీళ్లు కొంటున్నట్లు భవిష్యత్‌లో గాలి కొనే పరిస్థితి రాకూడదన్నారు. కరీంనగర్‌ జిల్లా పర్యటనలో ఉన్న మంత్రి కేటీఆర్‌.. హరితహారం కార్యక్రమంలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కొత్తగా వేసిన రోడ్లకు ఇరువైపులా మొక్కలు నాటాలన్నారు. ఎంత ఇబ్బంది ఉన్నా సంక్షేమ పథకాలు ఆపకూడదన్నదే ముఖ్యమంత్రి కేసీఆర్‌ లక్ష్యమని తెలిపారు. గ్రామ పంచాయతీలకు దామాషా పద్ధతిలో నిధులు విడుదల చేస్తున్నామని, తద్వారా గ్రామీణ స్థాయిలో అభివృద్ధి సాధించాలన్నదే ప్రభుత్వ ముఖ్య ఉద్దేశమని కేటీఆర్‌ వివరించారు. ఈ సందర్భంగా పలు స్థానిక అంశాలపై కేటీఆర్‌ మాట్లాడారు.



Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని