close

తాజా వార్తలు

Published : 27/11/2020 11:23 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

తిరుమలలో శాస్త్రోక్తంగా కైశిక ద్వాదశి ఆస్థానం

తిరుమల: తిరుమలలో కైశిక ద్వాదశి ఆస్థానంను తితిదే శుక్రవారం వైభవంగా నిర్వహించింది. శ్రీవారి ఆలయంలో స్నపనబేరంగా పిలువబడే ఉగ్ర శ్రీనివాసమూర్తి సమేత శ్రీదేవి, భూదేవి అమ్మవార్లకు తిరుచ్చి ఉత్సవాన్ని ఆలయంలో ఏకాంతంగా నిర్వహించారు. అనంతరం బంగారు వాకిలిచెంత ఆస్థానంను అర్చకులు వేడుకగా నిర్వహించారు. కైశిక ద్వాదశి ఆస్థానాన్ని పురాణపారాయణం ద్వారా అర్చకులు శాస్త్రోక్తంగా చేపట్టారు. ఏడాదిలో కైశిక ద్వాదశి రోజు మాత్రమే సూర్యోదయానికి ముందు ఉగ్రశ్రీనివాసమూర్తికి ఊరేగింపు నిర్వహించడం ఆనవాయితీ. నివర్‌ తుపాను ప్రభావంతో ఆలయంలోనే ఏకాంతంగా వేకువజామున నాలుగున్నర నుంచి ఐదున్నర గంటల మధ్య ఉత్సవాన్ని తితిదే నిర్వహించింది.


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

చిత్ర వార్తలు

సినిమా
మరిన్ని

దేవతార్చన