
తాజా వార్తలు
ఫ్యాషన్ ప్రియుల్ని ఆకట్టుకున్న కాజల్ డ్రెస్
ధరెంతో తెలుసా?
హైదరాబాద్: తన ప్రియసఖుడు గౌతమ్ కిచ్లుతో ఏడడుగులు వేసి శ్రీమతిగా మారారు అగ్రకథానాయిక కాజల్ అగర్వాల్. అక్టోబర్ 30న వీరి వివాహం ముంబయిలోని ఓ హోటల్లో వేడుకగా జరిగిన విషయం తెలిసిందే. ఆ తర్వాత ఈ జంట హనీమూన్ కోసం మాల్దీవులకు వెళ్లి వచ్చింది. వెకేషన్లో భాగంగా భర్తతో దిగిన పలు ఫొటోలు, వీడియోలను ఆమె ఇన్‌స్టా వేదికగా అభిమానులతో పంచుకున్నారు.
కాగా, టూర్‌కు సంబంధించి మొదటిరోజు ఆమె షేర్ చేసిన పలు ఫొటోలు నెటిజన్లను ఎంతో ఆకట్టుకున్నాయి. కాజల్ ధరించిన రెడ్ డ్రెస్ ఫ్యాషన్ ప్రియుల్ని ఎంతగానో ఆకర్షించింది. దీంతో ఆ డ్రెస్ ధర గురించి తెలుసుకునేందుకు పలువురు ఆసక్తి కనబరిచారు. ఆ రెడ్ డ్రెస్ ధర రూ.13 వేలు అని పలు ఫ్యాషన్ వెబ్సైట్లలో వార్తలు వచ్చాయి.
చిరంజీవి కథానాయకుడిగా తెరకెక్కుతోన్న ‘ఆచార్య’ సినిమాలో కాజల్ కథానాయికగా కనిపించనున్నారు. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూటింగ్ సెట్లోకి ఆమె త్వరలో అడుగుపెట్టనున్నారు. మరోవైపు కమల్‌హాసన్-శంకర్ కాంబినేషన్లో రానున్న ‘భారతీయుడు-2’ చిత్రంలో కాజల్ కీలకపాత్రలో కనిపించనున్నారు.