close

తాజా వార్తలు

Published : 26/12/2020 10:30 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

కాజోల్‌ డిజిటల్‌ అరంగేట్రం

ముంబయి: తారలంతా ఒక్కొక్కరుగా వెబ్‌ బాట పడుతున్నారు. ఓటీటీలకు ప్రేక్షకాదరణ పెరగడం, ఈ మధ్య వచ్చిన వెబ్‌సిరీస్‌లూ విజయవంతం కావడంతో డిజిటల్‌ వైపు అడుగులేస్తున్నారు. తాజాగా ప్రముఖ బాలీవుడ్‌ నటి కాజోల్‌ కూడా ‘త్రిభంగా’తో నెట్‌ఫ్లిక్స్‌ ద్వారా అరంగేట్రం చేస్తోంది. ఆమె భర్త అజయ్‌ దేవ్‌గణ్‌ ఆల్కేమీ ఫిల్మ్స్‌తో కలిసి నిర్మిస్తున్నారు. రేణుక షహాణే దర్శకత్వం వహించారు. ‘‘నా తదుపరి చిత్రం ‘త్రిభంగా’ జనవరిలో విడుదలవుతోంది. ముగ్గురు మహిళలకు చెందిన ఆసక్తికరమైన కథ ఇది. ప్రేక్షకుల ముందుకు ఎప్పుడెప్పుడు వస్తుందా? అని ఎదురు చూస్తున్నా’’ అని కాజోల్‌ చెప్పింది. వాస్తవానికి ‘త్రిభంగా’ ఈ ఏడాది జులైలోనే విడుదలవ్వాల్సింది, కొన్ని కారణల వల్ల వచ్చే ఏడాది జనవరికి నెట్‌ఫ్లిక్స్‌ వాయిదా వేసింది. సినిమా నిర్మాణాంతర కార్యక్రమాలన్నీ పూర్తయ్యాయి. విడుదల తేదీని ఖరారు చేయడమే మిగిలి ఉందని చిత్రబృందం తెలిపింది. ఒకే కుటుంబానికి చెందిన మూడు తరాల మహిళల మధ్య సాగే కథను ఆసక్తికరంగా మలిచారని సమాచారం.



Tags :
జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని