close
Array ( ) 1

తాజా వార్తలు

రాష్ట్ర ప్రజలను జగన్‌ మోసం చేస్తున్నారు: కళా

అమరావతి: లాక్‌డౌన్‌ సమయంలో సారా ఏరులై పారుతోందన్న స్పీకర్‌ వ్యాఖ్యలపై ప్రజలకు ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌ రెడ్డి సమాధానం చెప్పాలని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు కళా వెంకట్రావు డిమాండ్‌ చేశారు. ఇందుకు ఎక్సైజ్‌ శాఖ మంత్రి నైతిక బాధ్యత వహిస్తూ ప్రజలకు క్షమాపణలు చెప్పి తన పదవికి రాజీనామా చేయాలన్నారు. ఈ మేరకు ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో కరోనా వైరస్‌ విజృంభిస్తోన్న నేపథ్యంలో లాక్‌డౌన్‌ కారణంగా ప్రజలకు అవసరమైన పాలు, నీళ్లు దొరకడం కష్టంగా ఉంటే మద్యం మాత్రం వాలంటీర్ల ద్వారా డోర్‌ డెలివరీ చేస్తున్నారని ఆరోపించారు. ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు క్షేత్ర స్థాయిలో పనిచేస్తూ కరోనాపై తమ ప్రజల్లో ధైర్యం నింపుతుంటే ఏపీ సీఎం జగన్‌ మాత్రం తాడేపల్లికే పరిమితం కావడం సిగ్గుచేటని దుయ్యబట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా కరోనా బాధితుల్లో 30శాతం మంది అధికారులు, వైద్యులతోపాటు అత్యవసర సేవలు అందిస్తున్న వారే కావడం జగన్‌ ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనమని మండిపడ్డారు. జగన్‌ వైఖరి చూస్తుంటే ఐసోలేషన్‌ వార్డులు, క్వారంటైన్‌ కేంద్రాల్లో కూడా పోలింగ్‌ బూత్‌లు ఏర్పాటు చేసి ఎన్నికలు నిర్వహించేలా ఉన్నారని కళా వెంకట్రావు విమర్శించారు. 

లాక్‌డౌన్‌ కారణంగా ఉపాధి లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని కళా వెంకట్రావు ఆవేదన వ్యక్తం చేశారు. పంతాలు, పట్టింపులు పక్కన పెట్టి పేదల ఆకలి తీర్చేందుకు అన్న క్యాంటీన్లు తెరవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. సీఎం జగన్‌కు ముందు చూపు లేకపోవడంతో రాష్ట్రంలో ప్రజలు అష్ట కష్టాలు పడుతున్నారన్నారు. ప్రతి శుక్రవారం తన అక్రమాస్తులపై సీబీఐ కోర్టుకు అబద్దాలు చెబుతున్న జగన్‌ ఇప్పుడు కరోనా వైరస్‌ విషయంలో పాజిటివ్‌ కేసులపై బులిటెన్‌లో ఒకలా.. రిపోర్టుల్లో మరోలా తప్పుడు లెక్కలు చెప్పి రాష్ట్ర ప్రజలను మోసం చేస్తున్నారని దుయ్యబట్టారు. వైకాపా నాయకుల మితిమీరిన ప్రచార పిచ్చి వల్ల నేడు రాష్ట్ర వ్యాప్తంగా కొవిడ్‌ కేసులు పెరిగిపోతున్నాయని మండిపడ్డారు.  


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.