ఎంపీకి బెదిరింపులు.. కంగన అభిమాని అరెస్టు
close

తాజా వార్తలు

Updated : 11/09/2020 17:06 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఎంపీకి బెదిరింపులు.. కంగన అభిమాని అరెస్టు

కోల్‌కతా: నటి కంగనా రనౌత్‌ అభిమానిగా భావిస్తున్న ఓ వ్యక్తిని ముంబయి పోలీసులు అరెస్టు చేశారు. శివసేన ఎంపీ సంజయ్‌ రౌత్‌కు బెదిరింపు కాల్స్‌ చేసిన పలాష్ బోస్‌ అనే వ్యక్తిని గురువారం రాత్రి దక్షిణ కోల్‌కతాలో అదుపులోకి తీసుకున్నారు. అతడిని కోర్టు ముందు హాజరుపరుచనున్నట్లు పోలీసులు తెలిపారు.

నటుడు సుశాంత్‌సింగ్ మృతి విచారణకు సంబంధించి ముంబయి పోలీసులపై కంగన చేసిన వ్యాఖ్యలతో ఆమెకు, శివసేన ఎంపీ సంజయ్‌ రౌత్‌కు కొద్దిరోజులుగా మాటల యుద్ధం నడుస్తోంది. రౌత్‌ బెదిరింపులకు పాల్పడుతున్నారని, ముంబయి మినీ పీఓకేను తలపిస్తోందని నటి ఆరోపించింది. దీనిపై స్పందించిన శివసేన ఎంపీ.. అయితే తిరిగి ముంబయికి రావొద్దంటూ, మహారాష్ట్ర ప్రజలు నిన్ను క్షమించరంటూ మండిపడ్డాడు. పలువురు శివసేన నేతలు సైతం నటిపై విమర్శలు చేశారు. 

ఈ నేపథ్యంలోనే పలాష్ బోస్‌ అనే వ్యక్తి సంజయ్‌ రౌత్‌కు బెదిరింపు కాల్స్‌ చేశాడని ముంబయి పోలీసులు అతడిని అరెస్టు చేశారు. రౌత్‌తోపాటు పలువురుకి ఇలాంటి కాల్స్‌ వచ్చినట్లు సమాచారం. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రే, హోంమంత్రి అనిల్ దేశ్‌ముఖ్‌కు సైతం దుండగుల నుంచి ఇలాంటి కాల్స్‌ వచ్చినట్లు తెలుస్తోంది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని