close

తాజా వార్తలు

Updated : 06/04/2020 14:16 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

కరోనాపై  ప్రభుత్వం వాస్తవాలు దాస్తోంది :కన్నా

గుంటూరు: కరోనా వైరస్‌ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం వాస్తవాలు దాచిపెడుతోందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ఆరోపించారు. భాజపా 40వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా గుంటూరులోని ఆయన నివాసంలో పార్టీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం కన్నా మాట్లాడుతూ... దేశ ప్రజలందరి బాగు కోసం పార్టీ ఏర్పడిందని చెప్పారు. ప్రస్తుతం కరోనా వైరస్‌తో దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉందని.. ఇటువంటి సమయంలో భాజపా కార్యకర్తలంతా ముందుకొచ్చి సేవా కార్యక్రమాల్లో పాల్గొనాలని ఈ సందర్భంగా ఆయన పిలుపునిచ్చారు. రాష్ట్రానికి కేంద్రం ఇచ్చిన సొమ్మును ముఖ్యమంత్రి ఇచ్చినట్లుగా వైకాపా నేతలు ప్రచారం చేస్తు్న్నారని మండిపడ్డారు. వారికి మంచి బుద్ధి ప్రసాదించాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. అదేవిధంగా రాష్ట్రవ్యాప్తంగా కరోనా రోగులను గుర్తించటంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని.. ప్రభుత్వం విడుదల చేసే నివేదికల్లో వాస్తవం లేదని కన్నా విమర్శించారు. 

 



Tags :

రాజకీయం

జిల్లా వార్తలు
బిజినెస్‌
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
క్రైమ్
మరిన్ని