6వేల కోళ్ల సజీవ సమాధి
close

తాజా వార్తలు

Published : 12/03/2020 01:16 IST

6వేల కోళ్ల సజీవ సమాధి

బెంగళూరు: చైనాలో మొదలైన కరోనా వైరస్‌.. భారత పౌల్ట్రీ రైతులపై ప్రభావం భారీగానే చూపిస్తోంది. చికెన్‌ తినడం ద్వారా కరోనా వస్తుందంటూ రకరకాలుగా వదంతులు షికారు చేస్తుండటంతో చికెన్‌కు పెద్దమొత్తంలో డిమాండు పడిపోయింది. దీంతో పౌల్ట్రీ రైతులు తీవ్ర మనస్థాపానికి గురవుతున్నారు. దీనికి కర్ణాటకలోని ఓ రైతు చేసిన పనే ఉదాహరణ. ఆ రైతు దాదాపు ఆరు వేల కోళ్లను సజీవంగా పూడ్చివేయడం సంచలనం సృష్టించింది. అంతేకాదు తన బాధను అందరికీ తెలియజేసేందుకు దాన్ని వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో పోస్ట్‌ చేయడంతో వైరల్‌గా మారింది. 

నజీర్‌ అహ్మద్‌ అనే రైతు కర్ణాటకలోని గోకక్‌ తాలుకా.. నల్సూర్‌ గ్రామంలో నివసిస్తున్నారు. ఇటీవల కరోనా వదంతుల కారణంగా చికెన్‌కు డిమాండు పడిపోవడంతో మనస్థాపానికి గురయ్యాడు. దీంతో ఆరు వేల కోళ్లను గుంత తవ్వి అందులో పూడ్చి పెట్టాడు. కాగా దీనిపై అహ్మద్‌ ఓ మీడియాతో మాట్లాడుతూ.. కరోనా వదంతుల కారణంగా చికెన్‌ విలువ బాగా తగ్గిపోయింది. కిలో చికెన్‌ రూ.5 నుంచి 10కి అమ్ముడుపోతోంది అన్నారు. కోళ్లను పెంచడానికి తనకు రూ.6లక్షల వరకు ఖర్చు అయిందని చెప్పాడు. ఇప్పటికీ తాను వాటిని ఇంకా నిర్వహించాలంటే నష్టపోవడమే తప్ప వేరే మార్గం లేదని ఆవేదన వ్యక్తం చేశాడు. కాగా అతడు కోళ్లను పూడ్చివేసిన వీడియో వైరల్‌ కావడంతో.. పలువురు నెటిజన్లు అహ్మద్‌ చేసిన పనిపై మండిపడ్డారు. 



Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని