ఉద్రిక్తంగా కర్ణాటక బంద్‌
close

తాజా వార్తలు

Updated : 13/02/2020 11:15 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఉద్రిక్తంగా కర్ణాటక బంద్‌

బెంగళూరు: కర్ణాటక రాష్ట్రంలోని పరిశ్రమలు, సంస్థల్లో కన్నడిగులకు 75 శాతం ఉద్యోగ రిజర్వేషన్‌ కల్పించాలని కోరుతూ 113కు పైగా సంఘాలు, సంస్థల పిలుపు మేరకు రాష్ట్రంలో చేపట్టిన బంద్‌ ఉద్రిక్తంగా మారింది. డాక్టర్‌ సరోజిని మహిషి నాలుగు దశాబ్దాల కిందట ఇచ్చిన నివేదికను తక్షణమే అమలు చేయాలంటూ కన్నడ సంఘాలు, సంస్థల సమాఖ్య అధ్యక్షుడు నాగేశ్‌ బంద్‌కు పిలుపునిచ్చారు. దీంతో ఉదయం నుంచి వ్యాపార, వాణిజ్య సంస్థలు మూతపడ్డాయి. వాహనాల రాకపోకలు నిలిచిపోవడంతో ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. మంగుళూరులోని ఫరంగిపేట్‌లో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన పర్యాటకశాఖ బస్సుపై గుర్తుతెలియని వ్యక్తులు రాళ్ల దాడికి పాల్పడ్డారు. పర్యాటకశాఖ బస్సు తిరుపతి నుంచి మంగుళూరు వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. క్యాబ్‌లు, ఆటోలు, హోటళ్ల సంఘాల్లో కొందరు బంద్‌కు మద్దతుగా, మరికొందరు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేశారు. బంద్‌ సందర్భంగా అవాంఛనీయ ఘటనలకు తావివ్వకుండా నగరంలోని అన్ని ప్రాంతాల్లో బందోబస్తును రెట్టింపు చేసినట్లు నగర కొత్వాల్‌ భాస్కరరావు వెల్లడించారు.

 బంద్‌ నేపథ్యంలో సామాన్య ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూడాలని కర్ణాటక ముఖ్యమంత్రి యడియూరప్ప కోరారు. ఈ అంశంపై చర్చించేందుకు తాము ఎల్లప్పుడూ సిద్దమని ప్రకటించారు.  ముందుజాగ్రత్త చర్యగా బెంగళూరు విశ్వవిద్యాలయంలో గురువారం జరగాల్సిన అన్ని పరీక్షలను వాయిదా వేశారు.  Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని