
తాజా వార్తలు
ఇంద్రకీలాద్రిపై వైభవంగా కార్తిక దీపోత్సవం
అమరావతి: విజయవాడ ఇంద్రకీలాద్రిపై కార్తిక పౌర్ణమిని పురస్కరించుకుని కోటి దీపోత్సవం కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు. దుర్గామల్లేశ్వర స్వామి ఆలయంలోని మహామండపం, అంతరాలయం పరిసరాలు, గాలిగోపురం వద్ద భక్తులు దీపాలు వెలిగించారు. అనంతరం మల్లికార్జున స్వామి ఆలయం వద్ద నిర్వహించిన జ్వాలాతోరణంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. దీపోత్సవంతో ఇంద్రకీలాద్రి పరిసరాలు దేదీప్యమానంగా వెలుగొందాయి.
Tags :
జనరల్
జిల్లా వార్తలు