close

తాజా వార్తలు

Updated : 30/11/2020 10:46 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

తెలుగు రాష్ట్రాల్లో కార్తిక శోభ

హైదరాబాద్‌: కార్తిక పౌర్ణమి సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లోని శివాలయాలు, పుణ్యక్షేత్రాల్లో ఆధ్యాత్మికశోభ సంతరించుకుంది. తెల్లవారు జాము నుంచే భక్తులు పుణ్యస్నానాలు ఆచరించి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు.ఆలయాల్లో కార్తిక దీపాలు వెలిగిస్తున్నారు. నది, సముద్ర తీరాల్లో పుణ్యస్నానాలు ఆచరించి, దేవుణ్ని భక్తితో కొలిచారు. రాజమహేంద్రవరంలో గోదావరిలో భక్తుల కోలాహలం నెలకొంది. విశాఖ తీరంలోనూ మహిళలు ప్రత్యేక పూజలు చేశారు. తిరుమలలో కార్తిక మాస పౌర్ణమి సందర్భంగా గరుడసేవ నిర్వహించనున్నారు. ఇవాళ రాత్రి 7 గంటల నుంచి 8,30 వరకు శ్రీవారు గరుడ వాహనంపై దర్శన మివ్వనున్నారు.

గుంటూరు జిల్లా సూర్యలంక తీరంలో భక్తులు పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. మహిళలు సముద్రంలో దీపాలు వదులుతున్నారు. ఏపీ నలుమూలల నుంచి భక్తులు సముద్రస్నానానికి తరలివస్తున్నారు. అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు. సోమేశ్వరస్వామి, రామలింగేశ్వర స్వామి ఆలయాల్లో స్వామివారికి తైలాభిషేకాలు నిర్వహిస్తున్నారు.  విజయవాడ శ్రీదుర్గామల్లేశ్వరస్వామి ఆలయం, శ్రీశైలం, ద్రాక్షారామం,వేములవాడ, ధర్మపురి, కాళేశ్వరం తదితర ప్రముఖ శైవక్షేత్రాలో భక్తుల కోలాహలం నెలకొంది.  శైవక్షేత్రం గుంటూరు జిల్లా కోటప్పకొండ కార్తిక శోభతో విరాజిల్లుతోంది. భక్తులు త్రికుటేశ్వర స్వామిని దర్శించుకొని అభిషేకాలు నిర్వహించారు. మహిళలు దీపాలు వెలిగించారు. ప్రత్యేకంగా పాయసం వండి స్వామికి సమర్పించారు. కొవిడ్‌ దృష్ట్యా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.

మరిన్ని చిత్రాలకోసం క్లిక్‌ చేయండి



Tags :

జనరల్‌

జిల్లా వార్తలు
బిజినెస్‌
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
క్రైమ్
మరిన్ని