గంభీర్‌.. ఇక్కడ సమస్య డబ్బు కాదు
close

తాజా వార్తలు

Published : 07/04/2020 00:39 IST

గంభీర్‌.. ఇక్కడ సమస్య డబ్బు కాదు

దిల్లీ: కరోనా వైరస్‌ కట్టడికి డబ్బు కంటే రక్షణ తొడుగుల అవసరం ఎక్కువగా ఉందని భాజపా ఎంపీ గౌతమ్ గంభీర్ చేసిన విమర్శలను దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తిప్పికొట్టారు. కొవిడ్-19 బాధితులకు చికిత్స అందిస్తోన్న వైద్యులు, సంబంధిత సిబ్బంది ఈ రక్షణ తొడుగులు లేక ఇబ్బందిపడుతున్నారని వెల్లడించారు. ఎంపీ లాడ్స్‌ ద్వారా తాను అందించే సహాయాన్ని తీసుకోవడానికి వారికి ఈగో అడ్డం వస్తోందని గంభీర్ చేసిన విమర్శలపై కేజ్రీవాల్ పై విధంగా స్పందించారు. 

‘ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, డిప్యూటీ సీఎం నిధుల అవసరం ఉందన్నారు. కానీ, వారి అహం వల్ల నేను ఎంపీలాడ్స్‌ నుంచి ఇచ్చే రూ.50లక్షలను తీసుకోవడానికి ఇష్టపడటంలేదు. సామాన్య ప్రజలు ఇబ్బందిపడకూడదని మరో రూ.50లక్షలు ఇవ్వాలనుకున్నాను. ఈ కోటి రూపాయలు అత్యవసరంలో మాస్కులు, రక్షణ తొడుగులు కొనడానికి ఉపయోగపడొచ్చు’ అని గంభీర్ ట్వీట్‌ చేశారు. 

దానిపై వెంటనే స్పందించిన కేజ్రీవాల్..‘గౌతమ్‌జీ మీ ఆఫర్‌కు కృతజ్ఞతలు. ఇప్పుడు రక్షణ తొడుగులు అందుబాటులో లేకపోవడమే అసలు సమస్య. డబ్బు కాదు. మీరు వాటిని ఎక్కడి నుంచైనా తెచ్చివ్వగలిగితే చాలా కృతజ్ఞులై ఉంటాం. వాటిని వెంటనే దిల్లీ ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది’ అన్నారు. దేశవ్యాప్తంగా రక్షణ తొడుగులు అందుబాటులో లేకపోవడంతో వైద్య సిబ్బంది ఈ మహమ్మారి కోరల్లో చిక్కుకుంటున్నారు. ఇక, దిల్లీలో ఇప్పటికే 500పైగా కరోనా కేసులు నమోదవ్వగా, ఏడుగురు మృతి చెందారు. 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని