close

తాజా వార్తలు

Published : 23/08/2020 03:01 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

ధన్వంతరి నారాయణుడిగా ఖైరతాబాద్‌ గణపయ్య

హైదరాబాద్‌ : వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని ఖైరతాబాద్‌లోని గణపయ్య ధన్వంతరి నారాయణుడిగా భక్తులకు దర్శనిమస్తున్నారు. కరోనా మహమ్మారి నేపథ్యంలో ఈ దఫా విగ్రహం నిర్మాణాన్ని 9 అడుగులకే పరిమితం చేశారు. కొవిడ్‌ మహమ్మారికి ఔషధం తెచ్చే ధన్వంతరి నారాయణ గణపతిగా స్వామి దర్శనమిస్తున్నారు. చేతిలో వనమూలికలు, వైద్య పుస్తకంతో ఉన్న వినాయకుడికి కుడివైపున మహాలక్ష్మీదేవి, ఎడమవైపున సరస్వతి కొలువుదీరారు. కరోనా దృష్ట్యా భక్తులకు నేరుగా అనుమతి లేదని.. www.ganapathideva.org   వెబ్‌సైట్‌ ద్వారా పూజా కార్యక్రమాల నిర్వహణకు ఏర్పాట్లు చేసినట్లు నిర్వాహకులు వెల్లడించారు.

ఖైరతాబాద్‌ గణపయ్య తొలిపూజకు పరిమిత సంఖ్యలోనే భక్తులను అనుమతించారు. ఖైరతాబాద్‌ ఎమ్మెల్యే దానం నాగేందర్‌, దైవజ్ఞశర్మ, ఉత్సవ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

 

   




Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని