
తాజా వార్తలు
డిసెంబర్ 11న థియేటర్లలో ‘ఇందూ కీ జవానీ: కియారా
ముంబాయి: బాలీవుడ్ నటి కియారా అడ్వాణీ నటించిన ‘ఇందూ కీ జవానీ’ చిత్రం థియేటర్లో డిసెంబర్ 11న విడుదలవుతుందని తాజాగా కియారా సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. ప్రస్తుతం ఆమె ‘జగ్ జగ్ జీయో’ చిత్ర షూటింగ్ కోసం చండీగఢ్‌లో ఉన్నారు.
ఈ చిత్రం డిసెంబర్ 11న థియేటర్లలో విడుదలవుతుందని ఆమె చిత్రం పోస్టర్‌ను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. అంతే కాకుండా ‘ఇట్స్ హ్యాపెనింగ్’ అంటూ తన పోస్ట్‌లో రాసుకొచ్చింది. ఈ చిత్రం విడుదలకు ఎంతగానో ఎదురుచూస్తున్నట్టు సంతోషం వ్యక్తం చేశారు.
ఈ చిత్రానికి అబీర్ సేన్‌గుప్తా దర్శకత్వం వహించారు. ఇది మహిళా ప్రాధాన్యత కలిగిన చిత్రం. ప్రస్తుత పరిస్థితుల్లోని ఆన్లైన్ డేటింగ్ అప్లికేషన్స్ ఆధారంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రంలో కథ మొత్తం ఇందూ గుప్తాగా నటించిన కియారా పాత్ర చుట్టూ నడుస్తుంది. అలాగే ఆదిత్యా సీల్ పాత్ర ఆకట్టుకుంటుందని తెలిపారు.
ఇటీవలే ఆమె ‘జగ్ జీవన్ జీయో’ ఫస్ట్ లుక్‌ను సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఈ చిత్రంలో వరుణ్ ధావన్, నీతు కపూర్, అనిల్ కపూర్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.