అమ్మ మాట మధురం
close

తాజా వార్తలు

Published : 18/09/2020 23:48 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

అమ్మ మాట మధురం

ఆ చిన్నారి నవ్వే అందుకు సాక్ష్యం..!

ఇంటర్నెట్‌ డెస్క్‌: బోసి నవ్వులు కురిపించే చిన్నారులు తమ తల్లుల మాటలను ఇట్టే గుర్తు పట్టగలరు. కల్మషం లేని కన్నతల్లి పిలుపునకు ముసిముసిగా నవ్వుతూ సందడి చేస్తారు. అలాంటి ఆత్మీయత, అనురాగాల మేళవింపే ఓ చిన్నారి నవ్వులు కురిపిస్తున్న ఈ వీడియో. హియరింగ్‌ ఎయిడ్‌ పెట్టుకున్న ఆ బాలుడు.. తన మాటలకు స్పందిస్తూ చిరు నవ్వులు చిందిస్తుంటే ఆ తల్లి గుండె ఎంత పులకించిపోయిందో ..!

మైసన్ మెక్‌కల్లమ్‌. ఏడాది వయసున్న చిన్నారి . అతడికి పుట్టుకతోనే వినికిడి సమస్య ఉన్నట్లు గుర్తించారు. ఇటీవల వైద్యులకు చూపించడంతో హియరింగ్‌ ఎయిడ్‌ పరికరాలను అమర్చారు. ఇప్పుడు మైసన్‌ తన మాటలు వినగలుగుతున్నాడని ఆ తల్లి ఎంతగానో మురిసిపోతోంది. ‘‘మై సన్‌  నా మాట వినిపిస్తోందా?’’అని ఆ తల్లి పిలుస్తోంటే.. మొదటిసారి తన తల్లి మాటను విన్న ఆ చిన్నారి నవ్వులు కురిపిస్తున్నాడు.  ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు నెటిజన్లను భావోద్వేగానికి గురి చేస్తోంది.  చాలామందికి చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తుకు తెస్తోంది. వర్జీనియాలోని ఓ ఆసుపత్రిలో ఈ వీడియోను తీసి, సామాజిక మాధ్యమాల్లో పోస్ట్‌ చేయడంతో ఇప్పటికే 4.5 మిలియన్ల మంది దీనిని వీక్షించారు.Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని