close
Array ( ) 1

తాజా వార్తలు

ఆ అనుమతులు రద్దు చేయండి:కోమటిరెడ్డి

కేంద్రమంత్రిని కలిసిన భువనగిరి ఎంపీ

దిల్లీ: రంగారెడ్డి జిల్లా మేడిపల్లి, ముచ్చర్ల ప్రాంతాల్లో ఏర్పాటు చేయనున్న ఫార్మాసిటీ అనుమతులను రద్దు చేయాలని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు పర్యావరణ, అటవీశాఖ మంత్రి ప్రకాశ్‌ జావడేకర్‌ను ఆయన కలిసి విజ్ఞప్తి చేశారు. ఫార్మాసిటీ ఏర్పాటు చేసి 1,500 పరిశ్రమలు ఒకేచోటకు తరలించడం ద్వారా భారీగా కాలుష్యం వెలువడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఫార్మాసిటీకి దగ్గర్లోని చెరువులు, అటవీ ప్రాంతం, భూమి, నీరు, గాలి అన్నీ కలుషితమవుతాయని మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ఈ పరిశ్రమల ప్రభావం వంద కిలోమీటర్ల వరకు ఉంటుందని.. పరిసర ప్రాంతాల పర్యావరణం పూర్తిగా నాశనం అవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. 3వేల ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు చేయనున్న ఫార్మాసిటీ ద్వారా అధికార పార్టీ లబ్ధి పొందేందుకు ఏవిధంగా ప్రయత్నిస్తోందనే విషయాన్ని కోమటిరెడ్డి కేంద్ర మంత్రికి వివరించారు.

పేద రైతుల నుంచి పంటలు పండే భూమిని ఎకరా రూ.8లక్షలకు బలవంతంగా కొనుగోలు చేశారని.. అదే భూమిని ఎకరా రూ.1.50 కోట్లకు పరిశ్రమలకు ప్రభుత్వం కేటాయిస్తోందని కోమటిరెడ్డి ఆరోపించారు. ఇప్పుడు 3వేల ఎకరాలుగా పేర్కొన్న రాష్ట్ర ప్రభుత్వం.. భవిష్యత్తులో 19 వేల ఎకరాలకు విస్తరించే అవకాశాలు ఉన్నాయన్నారు. ఇప్పటి వరకు ఆ ఫార్మాసిటీ ఏర్పాటు ద్వారా స్థానికంగా కొత్తగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు వస్తాయని ఎక్కడా స్పష్టం చేయలేదని కేంద్రమంత్రి దృష్టికి కోమటిరెడ్డి తీసుకెళ్లారు. ఫార్మాసిటీకి దగ్గర్లోని ఇబ్రహీంపట్నం, చౌటుప్పల్‌, చిట్యాల తదితర ప్రాంతాలు కాలుష్య కోరల్లో చిక్కుకుపోతాయన్నారు. నిబంధనలు ఉల్లంఘించి ఏర్పాటు చేయనున్న ఫార్మాసిటీకి ఇచ్చిన అనుమతులు తక్షణమే రద్దు చేసి, స్థానిక ప్రజలకు న్యాయం చేయాలని కోమటిరెడ్డి విజ్ఞప్తి చేశారు.


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.