close
Array ( ) 1

తాజా వార్తలు

Updated : 04/06/2020 20:23 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

డీపీఆర్‌లు ఇచ్చేందుకు అంగీకరించాయి

కృష్ణా బోర్డు ఛైర్మన్‌ పరమేశం

హైదరాబాద్: కొత్త ప్రాజెక్టులకు సంబంధించి డీపీఆర్‌లు అందించేందుకు ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు అంగీకరించాయని.. ఈ మేరకు ఆయా రాష్ట్ర ప్రభుత్వాల నుంచి అనుమతులు తీసుకుని డీపీఆర్‌లు అందజేస్తామని అధికారులు తెలిపినట్లు కృష్ణా బోర్డు ఛైర్మన్‌ పరమేశం వెల్లడించారు. హైదరాబాద్‌లోని జలసౌధలో కృష్ణా నదీ యాజమాన్య బోర్డు నిర్వహించిన సమావేశంలో ఇరు రాష్ట్రాల అధికారులు, ఇంజినీర్లు తమ వాదనలు వినిపించారు. రెండు రాష్ట్రాలు పరస్పర ఫిర్యాదులు చేసుకున్న నేపథ్యంలో పలు ప్రాజెక్టులకు సంబంధించిన డీపీఆర్‌ల అంశంలో బోర్డు ప్రధానంగా చర్చించింది. రెండో దశ టెలిమెట్రీని ప్రాధాన్యతా అంశంగా పరిగణించి అమలు చేసేందుకు రెండు ప్రభుత్వాలు అంగీకరించినట్లు పరమేశం చెప్పారు.

శ్రీశైలం నుంచి 50:50 నిష్పత్తిలో విద్యుదుత్పత్తికి రెండు ప్రభుత్వాలు ఆమోదం తెలిపినట్లు బోర్డు తెలిపింది. తాగునీటి కేటాయింపులు 20 శాతం మాత్రమే లెక్కింపుపై జల సంఘానికి నివేదించేందుకు కూడా అంగీకరించాయని పేర్కొంది. ఏపీలోని గోదావరి నుంచి కృష్ణా బేసిన్‌కు తరలించిన జలాలపై జలశక్తి శాఖకు ఇప్పటికే నివేదించినట్లు బోర్డు పేర్కొంది. మరోవైపు ప్రస్తుత నీటి సంవత్సరానికి గానూ రెండు రాష్ట్రాలకు నీటి కేటాయింపుల విషయంపైనా బోర్డు స్పష్టతనిచ్చింది. యథావిధిగా ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు 66:34 నిష్పత్తిలో నీటిని వినియోగించుకునేలా కేటాయింపులు చేసింది. అలాగే కృష్ణా నదీ యాజమాన్య బోర్డును విజయవాడ తరలించాలని మరోమారు ఏపీ అధికారులు బోర్డు దృష్టికి తీసుకొచ్చారు. దీనిపై బోర్డు స్పందిస్తూ.. ఈ అంశంపై కేంద్ర జలశక్తి మంత్రిత్వశాఖదే తుది నిర్ణయమని స్పష్టం చేసింది.

తెలంగాణ తాగునీటి కేటాయింపులను 20 శాతం మాత్రమే పరిగణనలోకి తీసుకోవాలని కృష్ణా బోర్డును కోరినట్టు రాష్ట్ర నీటిపారుదల శాఖ ముఖ్యకార్యదర్శి రజత్‌ కుమార్‌ తెలిపారు. పోలవరం, పట్టిసీమ ద్వారా గోదావరి జలాలు కృష్ణకు మళ్లిస్తున్నారని.. ఈ నేపథ్యంలో తెలంగాణకు అదనపు జలాలు ఇవ్వాలని కోరినట్లు చెప్పారు.


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.